Publish Date:Apr 11, 2026
వైసీపీ అధినేత జగన్ ను ఆయన సొంత సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. జగన్ పై తెలుగుదేశం, జనసేనల పార్టీలను మించి షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధానిని టార్గెట్ చేస్తూ షర్మిల ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు.
ఇటీవల పార్లమెంటులో అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించడంతో ఎన్డీయే ప్రభుత్వం మైలేజ్ సాధించగా, దానిని అడ్డుకునేందుకు వైసీపీ నెగటివ్ ప్రచారం మొదలుపెట్టింది. అమరావతి సాధ్యం కాదని, అది కేవలం భ్రమ అని ప్రచారం చేస్తున్న వైసీపీ తీరును షర్మిల ఎద్దేవా చేశారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్ అనే పేరును షర్మిల జగన్ దిమ్మదిరిగేలా ఎద్దేవా చేశారు. మావిగన్ అమరావతికి ప్రత్యామ్నాయం అయితే.. పులివెందులకు అవి గొడ్డలి అని పేరుపెట్టడం సబబుగా ఉంటుందన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వచ్చి గొడ్డలిని ముడపెడుతూ పులివెందులకు అవిగొడ్డలి అని పేరుపెట్టాలని జగన్ కు సూచించారు. అవినాష్ రెడ్డి పేరులోని అవి అక్షరాలను వివేకా హత్యకేసులో గొడ్డలికి ముడిపెడుతూ ఆమె జగన్ లక్ష్యంగా సంధించిన విమర్శనాస్త్రం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ అయ్యింది. జగన్ రాజధానికి ప్రతిపాదించిన మావిగన్ పేరు కంటే.. తాను పులివెందులకు సూచించిన అవిగొడ్డలి పేరు జనానికి తేలిగ్గా అర్ధమౌతుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారిపోయాయి.
జగన్ మావిగన్ ప్రతిపాదనను తిప్పికొడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నేతలు.. అమరావతి స్వయం సమృద్ధి నగరం అంటూ వివరణలు ఇచ్చుకుంటుంటే.. షర్మిల మాత్రం దూకుడుగా వైసీపీ అధినాయకత్వాన్నే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించా, కూటమి పార్టీల కంటే ముందున్నారు. ఇప్పుడు షర్మిల చేసిన అవి గొడ్డలి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rename-pulivendula-as-avigoddali-25-217149.html
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.