చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు

Publish Date:Sep 10, 2023

Advertisement

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నతెలుగుదేశం  అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్ట్ రిమాండ్ విధించింది.  14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తున్నట్లుగా ఏసీబీ కోర్టు ప్రకటించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. హై ప్రొఫైల్ ఉన్న నేత కావడంతో ఆయన్ను జిల్లా జైలులో ఉంచే పరిస్థితి లేకపోవడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే పోలీసులు విజయవాడ నుండి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకూ రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. ఆయన్ను తరలించేందుకు వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించడంతో తెలుగుదేశం శ్రేణులలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక  రాష్ట్రమంతా   144 సెక్షన్ విధించారు.

 సభలూ సమావేశాలపై నిషేధం విధించారు. ఏసీబీ కోర్టులో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం 2.30 గంటలకు ముగిసాయి. మధ్యలో మూడు సార్లు విచారణకు బ్రేక్ ఇచ్చిన న్యాయమూర్తి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అర్ధగంట విచారణతో ముగించారు. సుమారు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారణ కొనసాగగా తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. కాగా, ఆరున్నర గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో కొన్ని కీలక అంశాలు హైలెట్ అయ్యాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. మొత్తం మీద ఈ కేసు విచారణ సందర్భంగా ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠత నెలకొంది. ఒకవైపు కోర్టులో వాదనలు సాగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలను తెలిపారు. రెండో రోజు కూడా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల నిర్బంధం కొనసాగింది. పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు కూడా సాగాయి.
 
కాగా, ఆదివారం సాయంత్రం తీర్పు రిజర్వ్ అనంతరం.. న్యాయమూర్తి తీర్పు ప్రకటన సందర్భంగా ఏసీబీ కోర్టు బయట ఉద్రిక్త వాతావరణం కనిపించింది. చంద్రబాబుకు అనుకూలంగా టీడీపీ కార్యకర్తల నినాదాలు చేసుండగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని అక్కడ నుండి తరలించారు. తీర్పు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో పోలీసులు, పారా మిలిటరీ బలగాల భారీగా మోహరించాయి. కోర్టు నుంచి 500 మీటర్ల మేర పోలీసులు, భద్రత సిబ్బంది మినహా ఇతరులకు అనుమతి నిరాకరిస్తూ ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. చంద్రబాబును తరలించేందుకు కాన్వాయ్ కూడా పోలీసులు సిద్ధం చేశారు. 

న్యాయమూర్తి తీర్పును బట్టి, పోలీసులు తమ కార్యాచరణను అమలు చేసే విధంగా అన్ని సిద్ధం చేసుకున్నారు. కోర్టు సమీపంలోకి మీడియాకు కూడా అనుమతి నిరాకరించారు పోలీసులు. అటు విజయవాడ నుంచి టీడీపీ పార్టీ ఆఫీస్ వరకు రూట్ క్లియర్ చేసిన పోలీసులు.. కోర్టు రిమాండ్ విధిస్తే చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో విజయవాడ నుండి రాజమండ్రి వరకూ కూడా పోలీసులు పక్కా ఏర్పాట్లతో పోలీసులు రూట్ క్లియర్ చేశారు. కోర్టు రిమాండ్ తిరస్కరిస్తే చంద్రబాబు కోర్టు నుండి టీడీపీ ఆఫీసుకు వెళ్లే అవకాశం ఉండగా.. అక్కడ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొత్తం మీద సుమారు నాలుగు గంటల పాటు చంద్రబాబు అరెస్ట్ పై న్యాయమూర్తి వెలువరించే తీర్పు కోసం అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎదురు చూశారు. మొత్తంపై చంద్రబాబు నాయుడుకి ఏపీబీ కోర్టు రిమాండ్ కు ఆదేశించడంతో.. చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.