Publish Date:Apr 18, 2026
ద్వంద్వ పౌరసత్వం వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లక్నో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం మౌఖికంగా ఆదేశించింది.
అయితే, ఈ తీర్పు కాపీపై సంతకం చేసే ముందే కోర్టు తన నిర్ణయాన్ని సమీక్షించుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాదన వినకుండా ఏకపక్షంగా ఆదేశాలు ఇవ్వడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. 2014 నాటి ఒక ఫుల్ బెంచ్ తీర్పును ఉటంకిస్తూ, నిందితుడికి నోటీసులు ఇచ్చి వివరణ కోరడం తప్పనిసరని కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకకు చెందిన బీజేపీ కార్యకర్త విగ్నేష్ శిశిర్ ఈ పిటిషన్ వేశారు.
2003-2009 మధ్య లండన్‌లోని 'బ్యాక్ ఆప్స్ లిమిటెడ్' అనే కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో రాహుల్ గాంధీ తనను తాను బ్రిటీష్ పౌరుడిగా పేర్కొన్నారని, ఇది భారత రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధమని ఆయన వాదన. గతంలో లక్నోలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. అప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియపై స్టే కొనసాగుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/relief-for-rahul-gandhi-in-dual-citizenship-case-36-217702.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే