రెడ్లకు రెడ్‌సిగ్నల్!.. న్యాయమా జగన్‌రెడ్డి?
Publish Date:Apr 12, 2022
Advertisement
కమ్మ వర్గమంటే జగన్‌కు అసలే పడదు. మీడియాకు, అధికారులకు, న్యాయవ్వవస్థకు, ఆఖరికి వ్యాక్సిన్‌కూ కమ్మ కులాన్ని అంటగట్టిన ఘనుడు జగన్. ఆయన రెడ్డి కావడం వల్లే.. చంద్రబాబు కమ్మ కులంలో పుట్టడం వల్లే.. అంతటి కుల ధ్వేషం ప్రదర్శిస్తున్నారని అంటారు. తాజా, మంత్రివర్గ కూర్పులోనూ కమ్మలకు అసలే స్థానం లేకుండా చేసి కక్ష, కసి తీర్చుకున్నారు. కమ్మ ఓటర్లు తనకు ఓటు వేయరు కాబట్టి.. వారికి తానెందుకు మంత్రి పదవి ఇవ్వాలనేది ఆయన లెక్క కాబోలు. కమ్మలు సరే.. మరి, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ వర్గాలేం పాపం చేశాయి? వారికి, మంత్రిమండలిలో ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదనే నిలదీస్తున్నారు. తెలుగుదేశానికి బీసీలు బ్యాక్‌బోన్ కాబట్టి.. వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చి.. వారిని వైసీపీ వైపు తిప్పుకోడానికే ఆ నాలుగు అగ్ర కులాలకు అన్యాయం చేశారని అంటున్నారు. అయితే, ప్రాధాన్యం, పెత్తనం లేని పదవులు ఎన్ని ఇచ్చినా ఏం లాభమనేది విపక్షం ఆరోపణ. ఇక, వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం పేరుతో ఆ నాలుగు కులాలతో పాటు తన సొంత వర్గమైన రెడ్లకూ జగన్‌రెడ్డి అన్యాయం చేశారనే విమర్శ కూడా వినిపిస్తోంది. తనను చూసి.. రెడ్లు గంపగుత్తగా తనకే ఓటు వేస్తారనే నమ్మకమో.. తనను కాదని ధిక్కరించరనే ధీమానో.. కారణం ఏదైనా.. ఏళ్లుగా తననే నమ్ముకున్న రెడ్లకు జగన్ కొత్త కేబినెట్‌లో సరైన న్యాయం జరగలేదని అంటున్నారు. పదేళ్ల పాటు అనేక ఖర్చులు పెట్టుకుని.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవులు వస్తాయని, పెట్టిన ఖర్చు రాబట్టుకోవచ్చని.. ఆశగా ఎదురు చూస్తున్న వారికి.. మరో సారి కూడా ఛాన్స్ మిస్సయిందని మండిపడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి నేతలంతా ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటూ జగన్‌రెడ్డిపై అసహనంతో రగిలిపోతున్నారని తెలుస్తోంది. మన రెడ్డే కదాని నమ్ముకుంటే.. నట్టేట ముంచాడే అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో మంత్రి పదవులు రాక అసంతృప్తికి గురైన చాలా మంది రెడ్లు.. ఈసారైనా అవకాశం వస్తుందని ఎదురు చూశారు. కానీ ఇప్పుడూ అవకాశం దక్కలేదు. రెడ్లుకు తానే బ్రాండ్ అంబాసిడర్‌నని.. అంతా తనను చూసే ఓటేస్తారని.. మరిక తన వర్గానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదనేది జగన్ అభిప్రాయంలా ఉంది. అదే ఆ వర్గం నేతలకు ఆగ్రహంగా మారింది.
http://www.teluguone.com/news/content/reddy-leaders-disappointed-on-jagan-new-cabinate-39-134300.html





