వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం దూరం అవుతోందా?

Publish Date:Feb 1, 2023

Advertisement

వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఓ విధంగా రాష్ట్రంలో రెడ్డి రాజ్యం నడుస్తోందంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు.  అంతేకాదు.. ప్రభుత్వంలో కొలువు దీరిన సలహాదారుల రూపంలో అయితేనేమీ.. వివిధ కార్పొరేషన్ సంస్థల అధిపతులుగా నియమించడంలో అయితేనేమీ.. వివిధ నామినేటేడ్ పోస్ట్‌లు కట్టబెట్టడంలో అయితేనేమీ.. టీటీడీ చైర్మన్, ఈవో వంటి పదవుల విషయంలో అయితేనేమి, శాసన మండలి  చైర్మన్, ఈవో పదివిలో అయితేనేమి మొత్తం రెడ్డి సామాజిక వర్గం వారికే మనసా వాచా   జగన్ ప్రభుత్వం కట్టబెట్టింది. అయినా కూడా జగన్ సర్కార్ పట్ల రెడ్డి సమాజిక వర్గంలో  ఆసంతృప్తి తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం ఉన్న స్థాయిలో రెడ్డి సమాజికవర్గంలో అసంతృప్తి గతంలో ఎన్నడూ లేదని ఆ సమాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఇదే సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు ..  కాసు బ్రహ్మానందరెడ్డి,  చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి , వైఎస్ రాజశేఖరరెడ్డి,  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెబుతున్నారు.

మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో రెడ్లదే రాజ్యమని.. అయితే వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణంతో.. ఆ తర్వాత వచ్చి కె రోశయ్య ప్రభుత్వంలోనే కాదు.. ఆ గద్దెనెక్కిన కిరణ్ కుమార్ ప్రభుత్వం వరకు ఇదే పరిస్థితి కొనసాగిందని.. దీంతో రెడ్లకు దక్కాల్సిన ప్రాధాన్యత ఎక్కడా తగ్గలేదని చెబుతున్నారు.

ఇక   జగన్.. ముఖ్యమంత్రి అయితే.. తమకు పూర్వ వైభవం వస్తోందని.. తమ సామాజిక వర్గానికి  జగన్   ఓ ఆశాకిరణమని ఆ సామాజిక వర్గం వారు భావించారు. వైఎస్ ప్రభుత్వంలో దక్కిన మర్యాద, ప్రాధాన్యత మళ్లీ దక్కుతోందని  ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా  వైసీపీలో చేరిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కొలువు తీరినా.. ప్రతిపక్షనేతగా వైయస్ జగన్‌కు అత్యంత గౌరవప్రదమైన స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువత జగన్ పాదయాత్ర లో రోడ్లు మీదకు వచ్చి మరీ తమ శక్తి కొలది ఖర్చు చేసి.. తమ విలువైన సమయాన్ని సైతం పక్కన పెట్టి.. మరీ జగన్ గద్దెనెక్కేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశారు. 

దీంతో 2019 ఎన్నికల్లో  జగన్ పార్టీ గెలుపు..  నల్లేరు మీద నడకే అయిందని..ఈ నేపథ్యంలో తమకు గౌరవం, విలువ దక్కుతోందని సదరు సామాజికవర్గం భావించింది కానీ,  జగన్ హయాంలో కనీస గౌరవం కూడా  దక్కడం లేదని సదరు   సామాజిక వర్గం వాపోతోంది.   

ఈ నేపథ్యంలో  రెడ్డి సామాజిక వర్గం చూపు తెలుగుదేశం వైపు మళ్లిందని అంటున్నారు. అందుకు ఉదాహరణ.. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి.. అలాగే ప్రకాశం జిల్లా నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  ఉమ్మడి కడప జిల్లా నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి,వరదరాజులు రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి గంగుల ప్యామిలీ, బైరెడ్డి ప్యామిలీలు  తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఎన్నికల నాటికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు భారీ సంఖ్యలో రెడ్లు... పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.

By
en-us Political News

  
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
గుంపులను చెదరగొట్టేందుకు  టియర్ గ్యాస్   ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో  భద్రతా దళాలు ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టాయి. 
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.