విజయవాడను సగం ముంచేసిన బుడమేరు ఇంకా శాంతించలేదా? చరిత్ర కనీవినీ ఎరుగని రీతిలో కురిసిన భారీ వర్షాలకు బుడమేరు ఉప్పొంగి ప్రవహించింది. సింగ్ నగర్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిలువులోతు వరద నీటిలో ప్రజలు నానా ఇబ్బందులూ పడ్డారు. గత వారంరోజులుగా ఇంకా పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి.
భారీ వర్షాలతో బుడమేరు ప్రవాహం అనూహ్యంగా పెరగడంతో మూడు చోట్ల గండ్లు పడటం కూడా ఈ పరిస్థితికి కారణం. కాగా ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేసి గండ్లను విజయవంతంగా పూడ్చివేసింది. మంత్రి నిమ్మల రామానాయుడు వారం రోజులు బడమేరు ఒడ్డునే ఉండి స్వయంగా గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. రెండు గండ్లను విజయవంతంగా పూడ్చేసినా మూడో గండి పూడ్చివేతకు ఆర్మీని రంగంలోకి దింపాల్సి వచ్చింది. మొత్తానికి మూడో గండి పూడ్చివేత కూడా పూర్తయ్యింది. ఇక వరద ముంపు భయంలేదని అంతా భావిస్తున్న వేళ బుడమేరు మళ్లీ భయపెడుతోంది.
స్థిరంగా కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరులో ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం బుడమేరు పరిసరప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బడమేరు పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బడమేరు మళ్లీ ప్రమాదకరంగా ప్రవహిస్తోందనీ, పరిసర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన కోరారు. ముఖ్యంగా గుణదల, సింగ్ నగర్ ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన సూచించారు. వర్షాలు తగ్గేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/red-alert-issued-to-budameru-surrounding-areas-25-184483.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.