హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ : వాతావరణ శాఖ
Publish Date:Aug 17, 2024
Advertisement
సీజన్ కాని సీజన్ లోనే వర్షం తన ప్రతాపం చూపిస్తుంది. ఇక తనకంటూ రాసిపెట్టి ఉన్న సీజన్ ఇది. ఇక విజృభించడమే పనిగా పెట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, ప్యాట్నీ, ప్యారడైజ్, బోయినపల్లి, బేగంపేట, చిలకలగూడ, మారేడుమిల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, హైదర్ నగర్, ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి, మేడ్చల్, బాలానగర్, జీడిమెట్ల ప్రాంతాల్లో.. అలానే కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, లింగంపల్లి, కొండాపూర్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది.
సనత్ నగర్, ఎర్రగడ్డ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కుత్బుల్లాపూర్, షాపూర్, జగద్గిరిగుట్ట, గుండ్ల పోచంపల్లి, సూరారం, బహదూర్‌పల్లి, సుచిత్ర ఏరియాల్లో భారీగా వాన కురుస్తోంది. కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, బషీర్ బాగ్, లక్డీకపూల్, నాంపల్లి, అబిడ్స్, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, నారాయణ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు డ్రైనేజీలు పొంగుతున్నాయి. మురికి నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాల కారణంగా నగర వ్యాప్తంగా ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఖాజాగూడ సిగ్నల్, బయోడైవర్సిటీ సిగ్నల్, ఐకియా సిగ్నల్, మల్కం చెరువు, గచ్చిబౌలి ప్రధాన రహదారుల మీద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ రాత్రి కూడా కుండపోత వర్షం కురుస్తుందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీగా వర్షాలు పడతాయని.. నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. వర్షాల కారణంగా ప్రమాదం సంభవిస్తే సహాయం కోసం 040 211 11 111 నంబర్ కి ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలి. మరికొన్ని గంటల పాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
http://www.teluguone.com/news/content/red-alert-in-hyderabad-meteorological-department-25-183111.html





