పాత కాపుల‌తో విజ‌య‌మ్మ‌ కొత్త వ్యూహ‌మా? జ‌గ‌న్ కోస‌మా? ష‌ర్మిల కోస‌మా?

Publish Date:Aug 29, 2021

Advertisement

జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టేశారు. విజ‌య‌మ్మ ఫోన్ చేసి పిలుస్తున్నారు. జ‌గ‌న్ కాద‌నుకున్నారు. విజ‌య‌మ్మ కావాల‌నుకుంటున్నారు. వారంతా వైఎస్సార్ హ‌యాంలో హేమాహేమీలు. సెప్టెంబ‌ర్ 2న పావురాల గుట్ట‌లో ఆయ‌న మ‌ర‌ణంతో చాలామంది కీల‌క నేత‌లు తెర‌మ‌రుగు అయిపోయారు. కాంగ్రెస్‌లో ఉన్నా.. లేన‌ట్టుగానే మిగిలిపోయారు. పార్టీకే క‌ట్టుబ‌డి ఉన్నారు. ప‌ద‌వుల‌కు క‌క్కుర్తిప‌డి జ‌గ‌న్ పంచ‌న చేర‌లేదు. అలాంటి వారంద‌రినీ 12 ఏళ్ల త‌ర్వాత విజ‌య‌మ్మ గుర్తుకుపెట్టుకొని మ‌రీ ఫోన్లు చేసి స్పెష‌ల్‌గా ఇన్వైట్ చేయ‌డాన్ని ఎలా చూడాలి? ఇన్నేళ్లూ లేనిది ఇప్పుడే విజ‌య‌మ్మకు వారు ఎందుకు గుర్తుకు వ‌స్తున్న‌ట్టు? దీని వెనుక ఏదైనా మ‌ర్మం ఉందా? మ‌రేదైనా రాజ‌కీయ వ్యూహం దాగుందా? అనే అనుమానాలు స‌ర్వ‌త్రా వినిపిస్తున్నాయి.  

ఏపీలో కేవీపీ, ఉండ‌వ‌ల్లిలాంటి వాళ్లు ఒక‌ప్పుడు వైఎస్‌కు లెఫ్ట్‌, రైట్ అన్నట్టు ఉండేవారు. కేవీపీ మైండ్‌ను వైఎస్సార్ విచ్చ‌ల‌విడిగా వాడుకుంటే.. ఉండ‌వ‌ల్లి నోరును రామోజీరావుపై ఆయుధంగా ప్ర‌యోగించారు. ఇక తెలంగాణ‌లో డీఎస్‌, కోమ‌టిరెడ్డి, పొన్నం లాంటి వాళ్లు రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి న‌మ్మినబంట్ల‌లా ఉండేవారు. వైఎస్సార్ మ‌ర‌ణించాక వారంతా జ‌గ‌న్ వెంట పోలోమ‌ని పార్టీ ఫిరాయించ‌లేదు. వైఎస్సార్ బ‌లోపేతం చేసిన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. వైఎస్సార్ ఆత్మ‌లాంటి కేవీపీపై జ‌గ‌న్ చేసిన రాజ‌కీయ కుట్ర‌లు అన్నీఇన్నీ కావు. కాంగ్రెస్‌ను వీడిన తొలినాళ్ల‌లోనే కొండా సురేఖ‌తో కేవీపీ మీద అవినీతి విమ‌ర్శ‌లు చేయించిన చ‌రిత్ర జ‌గ‌న్‌ది. తండ్రికి అత్యంత ఆత్మీయుడైన కేవీపీని తొక్కేయాల‌ని చూసిన ప్ర‌బుద్ధుడు జ‌గ‌న్‌. ఉండ‌వ‌ల్లిని సైతం డోంట్‌కేర్ అన్నారు. అందుకే, వారిద్ద‌రు జ‌గ‌న్ ఇగోకు త‌ట్టుకోలేక.. కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. ఇక జ‌గ‌న్ ఏపీకే ప‌రిమిత‌మ‌య్యారు కాబ‌ట్టి తెలంగాణ కాంగ్రెస్ వాదుల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని చెప్పొచ్చు. జ‌గ‌న్ విష‌యం ప‌క్క‌న‌పెడితే.. స‌డెన్‌గా విజ‌య‌మ్మ‌కు వాళ్లంతా ఎందుకు గుర్తొచ్చార‌నేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 

మామూలుగా నైతే ఏడాదికో, ప‌దేళ్ల‌కో, 20, 25, 50, 75, 100 ఇలా కొన్ని మైలురాయి సంవ‌త్స‌రాల‌ను ప్ర‌త్యేకంగా జ‌రుపుతుంటారు. కానీ, వైఎస్సార్ చ‌నిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇదేమంత ప్ర‌త్యేక స‌మ‌య‌మూ కాదు. కానీ, ఎందుక‌నో కానీ విజ‌య‌మ్మ వైఎస్సార్ వ‌ర్థంతిని ఈసారి ప్ర‌త్యేకంగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా అప్ప‌టి వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితులు, కేబినెట్ స‌హ‌చ‌రుల‌ను ఫోన్ చేసి మ‌రీ ఆహ్వానిస్తున్నార‌ని స‌మాచారం. కేవీపీ, ఉండ‌వ‌ల్లి నుంచి డీఎస్ వ‌ర‌కు.. ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్ మ‌నుషుల‌ను ఇన్వైట్ చేయ‌డంపై రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.  

వారంతా వ‌స్తారా? రారా? అనేది ప‌క్క‌న పెడితే.. పిలిచారా.. లేదా.. అనేదే ఇక్క‌డ కీల‌కాంశం. ఇదంతా ఎందుకు? విజ‌య‌మ్మ మునుపెన్న‌డూ లేనిది ఈసారి ఇంత హంగామా ఎందుకు చేస్తున్న‌ట్టు? జ‌గ‌న్ కోస‌మా? ష‌ర్మిల కోస‌మా? అంటే ఇద్ద‌రి కోస‌మూ అనే వారూ ఉన్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌మ్మ జ‌గ‌న్‌కు దూరంగా ష‌ర్మిల చెంత ఉంటున్నా.. ఎంత‌కాద‌న్నా వారంతా ఒకే కుటుంబం.. వారంతా ఒక్క‌టే.. పైపైకి అలా చేస్తున్నార‌నే అనుమాన‌మూ ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్ ప‌రిస్థితి అస‌లేమాత్రం బాగాలేదు. ప్ర‌జావ్య‌తిరేక‌త‌, సీబీఐ కేసు, బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశం, జ‌గ‌న్ జైలుకెళితే పార్టీని హ‌స్త‌గ‌తం చేసుకోవాల‌ని కాచుకు కూర్చున్న కీల‌క నేత‌ల ద్వ‌యం.. ఇలా జ‌గ‌న్ అత్యంత క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నార‌నేది విజ‌య‌మ్మ భావ‌న‌. ఇప్పుడున్న వైఎస్సార్‌సీపీలో ఎవ‌రినీ గుడ్డిగా న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఎవ‌రూ అంత‌టి స‌మ‌ర్థులూ కారు. అందుకే, త‌న భ‌ర్త వైఎస్సార్ న‌మ్మిన కేవీపీ, ఉండ‌వ‌ల్లి లాంటి వారినే ఇప్పుడు విజ‌య‌మ్మ సైతం న‌మ్ముతున్నారు. వైఎస్సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం నిర్వ‌హించి.. ఆనాటి న‌మ్మ‌ద‌గిన నేత‌ల‌ను ఆహ్వానించి.. వారితో కీల‌క మంత‌నాలు జ‌ర‌పాల‌నేది విజ‌య‌మ్మ ఆలోచ‌న‌లా క‌నిపిస్తోంది. జ‌గ‌న్‌ను సుర‌క్షితం చేసేందుకు వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు ఉంది. జ‌గ‌న్‌కు సంబంధం లేకుండా.. కొడుకు కోసం విజ‌య‌మ్మ చేస్తున్న సొంత ప్ర‌య‌త్నం అంటున్నారు. మ‌రి, అందుకు ఆనాటి నేత‌లు ఈనాడు ఆమెకు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తారో చూడాలి..

ఇక‌, తెలంగాణ‌లోని వైఎస్సార్ ప్ర‌ధాన స‌హ‌చ‌రుల‌ను ఆహ్వానించ‌డం వెనుకున్న రీజ‌న్‌ను ఈజీగానే గెస్ చేయొచ్చు అంటున్నారు. ఇంకెందుకు ష‌ర్మిల కోస‌మే. వైఎస్సార్ పేరు మీదుగా పార్టీ పెట్టినా.. పాపం ష‌ర్మిల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక్క కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆల్ ది బెస్ట్ చెప్ప‌డం మిన‌హా పాత కాపులెవ‌రూ ఆమెకు కొత్త‌గా స‌పోర్ట్ చేయ‌డం లేదు. అందుకే, వైఎస్సార్ వ‌ర్థంతి పేరుతో.. పాత వైఎస్ సెంటిమెంట్‌ను కొత్త‌గా రాజేసేందుకు విజ‌య‌మ్మ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. అందుకే, ఆనాటి వైఎస్సార్ కేబినేట్ స‌హ‌చ‌రులంద‌రినీ సెప్టెంబ‌ర్ 2న ప్ర‌త్యేకంగా ఆహ్వానిస్తున్నార‌ట విజ‌య‌మ్మ‌. పాపం.. కూతురు కోసం విజ‌య‌మ్మ ఇంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. అది ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి...
 

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.