జగన్‌రెడ్డి ఒరిస్సా టూర్ వెనుకు ఇంత స్కెచ్ ఉందా?

Publish Date:Nov 11, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒరిస్సా వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్’ తో భేటీ అయ్యారు. అధికారికంగా ముఖ్యమంత్రి ఒరిస్సా వెళ్ళింది, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసింది, ఉభయ రాష్ట్రాల సాగు నీటి సమస్యలు, రెండు రాష్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యలపై చర్చించేందుకే కావచ్చును, కానీ, అది నిజామా అంటే, కాదంటున్నారు. సహజంగా నీటి సమస్యలు, జల వివాదాలు లేదా కొన్ని పత్రికలలో వచ్చిన గంజాయి లింకుల వ్యవహారమే అయినా లేక మావోల సమస్య మరో సమస్య అయినా నేరుగా ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరగవు. ముందు వివిధ స్థాయిల్లో అధికారుల మధ్య, ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. చివరాఖరులో, అవసరం అనుకుంటే, ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతాయి. కానీ, ఇక్కడ అదేమీ లేదు.

ముఖ్యమంత్రుల భేటీకి ముందు ఏ స్థాయిలోనూ ఎలాంటి చర్చలు జరగలేదు. అధికారుల స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన సమాచారం కూడా ఉన్నట్లు  లేదు. ఒక్క సారిగా, ముఖ్యమంత్రి ప్రత్యేక ఫ్లైట్ ఎక్కి భువనేశ్వర్’లో దిగారు. అఫ్కోర్స్ ముందుగా ఒరిస్సా సీఎం అప్పాయింట్మెంట్ తీసుకోవడం, ఇతర ప్రోటోకాల్ ఫాలో అయ్యారు అనుకోండి, అయినా జగన్ రెడ్డి ఒరిస్సా పర్యటన పూర్తిస్థాయి అధికార పర్యటన అయితే కాదనే, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వామి కార్యంతో పాటుగా స్వకార్యం కూడా చక్కబెట్టుకునే ఉద్దేశంతోనే, జగన్ రెడ్డి ఒరిస్సా వెళ్లి వచ్చారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అంతే కాదు, స్వామి కార్యం, స్వకార్యంతో పాటుగా, పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూతగానూ జగన్ రెడ్డి ఒరిస్సా పర్యటన సాగిందని అటు అమరావతి ఇటు హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఉభయ తెలుగు  రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటీవల కాలంలో కేంద్రంతో కాలు దువ్వేందుకు ఉబలాట పడుతున్నారు. మరోవంక కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏమి చేస్తుందో, అనే భయంతో షేక్ అవుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మరింత ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలోనే, రాజకీయ టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన కేసీఆర్, రక్షణ కవచం ఏర్పరచుకునే ప్రయత్నాలలో పడ్డారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్  వరసగా రెండు రోజులు.. గంటలకు గంటలు ప్రెస్మీట్లు పెట్టి, ఎదో చేద్దామని ప్రయత్నించారు. అది కాస్తా బూమ‌రాంగ్ అయింది. అలాగే ఇప్పుడు ఉత్తరాది - దక్షిణాది విబేధాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షణాది రాష్ట్రాల ప్రధాని అభ్యర్ధిగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పేరును తెర మీదకు తెచ్చేందుకు కేసీఆర్ ప్రణాళిక సిద్డం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే, కేసీఆర్ ఒకే పడవలో ప్రయాణిస్తున్న మంచి మిత్రుడు జగన్ రెడ్డిని తమ దూతగా ఒరిస్సా పంపారని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రెండు రోజుల మారథాన్ ప్రెస్ మీట్’ లో చూచాయగా ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన చేయడం, అలాగే, రాయలసీమ పట్ల ప్రేమను వొలక పోయడం, చేపల పులుసు సంగతులు గుర్తు చేసుకోవడంవంటి ఉదంతాలను విశ్లేషకులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఇదంతా  కేసీఆర్ ఆత్మ రక్షణ వ్యూహంలో భాగంగా తెర మీదకు తెస్తున్న ‘ఫ్రంట్’కు సంకేతాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, కేసీఆర్, జగన్ రెడ్డి నైజం తెలిసిన నవీన్ పట్నాయక్, కేసీఆర్ దూతగా జగన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారని భువనేశ్వర్ నుంచి వ‌స్తున్న‌ సమాచారం.
 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.