జగన్ నెల్లూరు పర్యటన రద్దు కు కారణమేంటో తెలుసా?

Publish Date:Jul 2, 2025

Advertisement

పేరుకే పరామర్శ యాత్ర.. కానీ వాస్తవంగా ఆ పేరుమీద మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసేది బలప్రదర్శన. ఇప్పటి వరకూ జగన్ చేసిన పరామర్శ యాత్రలన్నీ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి అంటూ తలపెట్టిన యాత్రకు పోలీసులు రోడ్ షోకు అవకాశం లేకుండా ఆయన హెలికాప్టర్ నేరుగా జిల్లా జైలుకు అతి సమీపంలో ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ కు అనుమతి ఇచ్చారు.

అయితే జగన్ ఉద్దేశం పరామర్శ కాదు..పెద్ద ఎత్తున జనసమీకరణ జరిపి బల ప్రదర్శన చేయడం. అందుకు అవకాశం లేకపోవడంతో జగన్ నెల్లూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ పర్యటన రద్దుకు కారణం ఇది అయితే..  జగన్ నెల్లూరు పర్యటనకు పోలీసులు అడ్డంకులు
సృష్టించారంటూ వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.  జగన్ హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి సరైన స్థలం ఇవ్వలేదంటూ వైసీపీ చేస్తున్న విమర్శలన్నీ అవాస్తవాలేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి గురువారం (జూన్ 3) జగన్ నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ను పరామర్శించాల్సి ఉంది. ఇందుకు పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. అయితే వైసీపీ కోరిన ప్రాంతంలో కాకుండా వేరే చోట జగన్ హెలికాప్టర్ కోసం హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు. 

అయితే జగన్ తన పరామర్శ యాత్రలకు భారీ ర్యాలీ, జనసమీకరణలతో అట్టహాసంగా చేపట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్లాన్ చేసుకుంటారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం అంటూ విమర్శలు గుప్పించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇక జగన్ పర్యటన ఆద్యంతం వైసీపీ శ్రేణులు ఆగడాలు, అరాచకాలకు అంతే లేదన్నట్లుగా చెలరేగిపోతాయి. ఇటీవల జగన్ యాత్రలలో అదే జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ నెల్లూరు పర్యటన విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జగన్ భారీ ర్యాలీలకు అవకాశం లేకుండా నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ కు అనుమతి ఇచ్చారు. ఎందుకంటే జగన్ పరామర్శయాత్ర అంటూ బలప్రదర్శనకు పాల్పడుతున్నారని పోలీసులు అంటున్నారు. దీంతో శాతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయంటున్నారు. ప్రజా భద్రత ధ్యేయంగా తాము అన్ని చర్యలూ తీసుకోవాల్సి ఉంటుందనీ, అందుకే నెల్లూరు జైలుకు సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు కు సూచించామనీ పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారన్న వాదనలో వాస్తవం లేదని తేలిపోయిందనీ, నెల్లూరు జైలుకు సమీపంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం వల్ల భారీ ర్యాలీకీ అవకాశం లేకుండా పోతుంది. హెలికాప్టర్ దిగా నేరుగా జిల్లా జైలుకు వెళ్లి కాకాణిని పరామర్శించి మళ్లీ వెంటనే అదే హెలికాప్టర్ లో వెనక్కు వెళ్లిపోవాల్సి ఉంటుంది. 

పోలీసులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇటీవలే జగన్ పల్నాడు పర్యటన సంద ర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం కింద పడి సింగమయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి జగన్ పై కేసు కూడా నమోదైంది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో భారీ వాహన శ్రేణితో ర్యాలీగా వచ్చే అవకాశం లేకుండా జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు వైసీపీకి సూచించారు. అయితే జగన్ కు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పరామర్శ కంటే రాజకీయ బల ప్రదర్శనే ముఖ్యం కనుక నెల్లూరు పర్యటనను, కాకాణి పరామర్శనూ రద్దు చేసుకున్నారు. అయితే తన పర్యటనకు పోలీసులు అడ్డంకులు సృష్టించారనీ, అనుమతి ఇవ్వలేదనీ ప్రచారం చేసుకుంటున్నారు.  పల్నాడు వంటి సంఘటన పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తాము నెల్లూరు జైలుకు అతి సమీపంలో హెలిపాడ్ కు స్థలం చూపామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.