కేసీఆర్ మౌనం వెనక మతలబు ఏమిటి ?

Publish Date:Jan 31, 2022

Advertisement

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు (సోమవారం) మొదలయ్యాయి.ఈ సమావేశాలు ఎప్పటిలానే రెండు విడతల్లో జరుగుతాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకూ తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఐదు  రాష్ట్రాల అసెంబ్లీ  ఎన్నికలు, కొవిడ్  నిబంధనల నడుమ జరుగతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతాయని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. 

ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ నెల 10 వతేదీన తోలి విద్ పోలింగ్ జరగనుంది.ఈ నేపధ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అధికార ప్రతిపక్షాలు, ప్రచార వేదికలుగా మలచున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. వర్షాకాల సమావేశాలు, ఆల్మోస్ట్ తుడిచి పెట్టుకు పోయాయి.   రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అంశం, పెగాసిస్ స్పైవేర్ వ్యవహారం వంటివి ఈసారి పార్లమెంటులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉభయ పక్షాలకూ కీలకం కానున్నాయి.

అదలా ఉంటే తెలంగాణ రాజకీయాలు, తెరాస వర్సెస్ బీజేపీ, రాష్ట్రం వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారిన నేపధ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెరాస సభ్యులు ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తిని రేకిస్తోంది. గత నవంబర్,డిసెంబర్ మాసాల్లోజరిగిన వర్షకాల సమావేశాల్లో తెరాస ఎంపీలు ముందు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కొంత అగ్రెసివ్’గా దూకుడు ప్రదర్శించినా, మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయ్యారు.  బాయ్ కాట్ పేరున అస్త్రసన్యాసం చేసి బయట పడ్డారనే విమర్శలు ఎదుర్కున్నారు. 

ఆలాగే, కాంగ్రెస్’ పార్టీకి దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్’ ఫై  కాంగ్రెస్ సారధ్యంలో జరిగిన సమావేశానికి, తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవ రావు (కేకే) హాజరయ్యారు కానీ, ఆ తర్వాత పీసీసీ చీఫ్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెరాసతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకునే ప్రయత్నంలో  భాగంగా కేకే పిలవని పేరంటానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈనేపధ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెరాస కేంద్రం పై యుద్దాన్ని కొనసాగిస్తుందా? రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ, తెరాసను దూరంగా ఉంచుతుందా? అదే కేసేఆర్ కలలు కంటున్న, ఫెడరల్ ఫ్రంట్’కు ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసివస్తాయా ... తెరాస కాంగ్రెస్’తో చేతులు  కేంద్రంపై నిజగానే కత్తులు  దూస్తుందా .., ఇలా .. తెరాస ఎంపీల ప్రతికదలిక మీద కెమెరా కన్నేసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.   

అదలా ఉంటే, తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అయితే, ఆయన స్వరంలో అంత కరుకుదనం లేదని, అంటున్నారు. నిజానికి గతంలో ముఖ్యమంత్రి స్వయంగా మీడియా ముందుకు వచ్చి కేంద్రం ఫై యుద్ధం ప్రకటించారు. కానీ, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత, మీడియా ముందుకు వచ్చిన ఎంపీ రంజిత్‌రెడ్డి చో ..చో..గా, పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై  కేసీఆర్‌ చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు సీఎం ఇచ్చారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని కేసీఆర్‌ తప్పుబట్టారు, అందుకు నిరసనగా  రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు అంటూ పొడి పొడిగా నాలుగు ముక్కలతో  సరిపెట్టారు.  అలాగే, విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడుతామని రంజిత్‌రెడ్డి తెలిపారు.మరో వంక, యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పిన కేసీఆర్, కేటీఆర్ ఆవిషయమ్లో సైలెంట్ అయి పోయారు. 

కాగా, ముఖ్యమంత్రి కేసేఆర్ స్వరం మారిందని, అయన  ధోరణిలో మార్పు/ భయం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  అయితే ఇది ... సంధికి సంకేతమా లేక ప్రళయం ముందు ప్రశాంతతా, అనేది స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. అయితే అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా అసలు యుద్ధం మార్చి 10 న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత,మార్చి 14 నుంచి మొదలయ్యే మలివిడత బడ్జెట్ సమావేశాల్లోనే బయటకు వస్తుందని, అంతవరకు వరకు కేసేఅర్ వ్యూహాత్మక మౌనమే పాటిస్తారని అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.