స్వామీ ఏమి ఈ క్రిష్టియ‌న్ ప్రేమ‌! బేసిగ్గా హిందూ ద్వేష భావ‌జాల‌మా?

Publish Date:Apr 21, 2025

Advertisement

సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి  చంద్ర‌బాబు అంటే అంత ద్వేషం ఎందుకు?
జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన‌ అభిమానం.. కార‌ణ‌మేంటి?
అస‌లు స్వామికి  తిరుమ‌ల తిరుప‌తి అంటే అంత ఇంట్ర‌స్ట్ ఏంటి?
సాటి సామాజిక వ‌ర్గ‌పు జ‌య‌ల‌లిత‌ను వ‌ద‌ల‌ని స్వామి
క్రిష్టియ‌న్ అయిన జ‌గ‌న్ అంటే ప్ర‌త్యేక ప్రేమ క‌న‌బ‌రుస్తారెందుకు?

2021లో ప‌రువు న‌ష్టం దావా..
2023లో శ్రీవాణి విష‌యంలో బాబు, ప‌వ‌న్ పై ఆరోప‌ణ‌లు..
2024లో ల‌డ్డు నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారంలో బాబు వ్యాఖ్య‌ల ఆధారంగా భ‌ద్ర‌త‌పై ప్ర‌శిస్తూ పిటిష‌న్..
2025లో టీటీడీ చైర్మ‌న్ వ‌య‌సు మ‌ళ్లిన మ‌నుషుల‌కు మ‌ల్లే ఆవులు సైతం చనిపోతాయ‌న్న కామెంట్ల‌పైనా కేసు వేస్తాన‌న‌డం..
అదే జ‌గ‌న్ పాల‌న‌లో క‌నీసం ఒక్క మాట కూడా అన‌ని స్వామి- అంత‌ర్యం ఏమిటి? అని చూస్తే..
పై నాలుగు ఘ‌ట‌న‌ల్లో స్వామి డైరెక్టుగా కానీ.. ఇన్ డైరెక్టుగా కానీ సుబ్రహ్మణ్య స్వామి చంద్ర‌బాబును అటాక్ చేశార‌న‌డానికి మ‌న ద‌గ్గ‌రున్న ఆధారాలు. బీజేపీకి ప్రాతినిథ్యం వ‌హించే స్వామి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్.. త‌మ కూట‌మిలో భాగ‌స్వామ్యం అన్న క‌నీస  జ్ణానం కూడా లేకుండానే కామెంట్లు  ఎందుకు చేస్తుంటారో అర్ధం కాదు..  తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మాత్ర‌మే కాకుండా.. ఆపై కేసులు కూడా వేస్తుంటారు.   

ఇదే స్వామికి క్రిష్టియ‌న్ జ‌గ‌న్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అంతులేని ప్రేమతో కూడిన‌ వాత్సల్యాన్ని క‌న‌బ‌రుస్తుంటారు. అదేమంటే జ‌గ‌న్ హ‌యాంలో తాను తిరుమల తిరుపతి దేవస్ధానం ఆదాయ వ్య‌యాల‌పై కాగ్ ఆడిట్ చేయించాల‌ని కోర‌గా.. అందుకు ఆయ‌న‌ ఒప్పుకున్నారు. దీంతో స్వామి..  జ‌గ‌న్ ని ప‌ల్లెత్తు మాట కూడా అన‌ర‌ని చెబుతారు.

కానీ ఇక్క‌డే స్వామిని అనుమానించాల్సి వ‌స్తోంది. ఇదే స్వామి ఇటు నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల‌ను, అటు అక్ర‌మాస్తుల కేసులో జ‌య‌ల‌లిత వంటి వారిని కోర్టు కీడ్చారు. మ‌రీ ముఖ్యంగా  జ‌య త‌న ప‌ద‌వి వీడేలా చేసిన ఘ‌న‌త సుబ్ర‌హ్మ‌హ్మ‌ణ్య స్వామిది.
సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి టీటీడీ అంటే ఎందుకంత ఆస‌క్తి అంటే తిరుపతి హైంద‌వ ఆధ్యాత్మిక బాంఢాగారం.. అక్క‌డ ఏ చిన్న త‌ప్పిదం జ‌రిగినా ఒక బాధ్య‌త కొద్దీ  తాను స్పందిస్తాన‌ని అంటారాయ‌న‌. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సోనియా, జ‌య‌ల‌లిత వంటి వారి విష‌యంలో అవినీతి మ‌కిలిని తుద‌ముట్టించే వ‌ర‌కూ తాను నిద్రించేది లేద‌ని.. అంటారు. బేసిగ్గా తాను అంత‌టి నీతి మంతుడ్న‌ని తెలియ చేస్తుంటారు.

ఇక్క‌డ మ‌రో విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే చెన్నై మైలాపూర్ లో పుట్టిన స్వామి   బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. జ‌యల‌లిత‌ సైతం అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. అందుకే ఆమె తానెంత‌టి సీఎం స్థాయి వ్య‌క్తినైనా కుంభ‌కోణం వంటి  బ్రాహ్మ‌ణ ఆధిప‌త్యం గ‌ల నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ  చేస్తుంటారు. సాటి సామాజిక వర్గానికి చెందిన  జ‌య అంటే కూడా స్వామికి  ప‌డ‌దు. అదేమంటే ఆమె చుట్టూ పేరుకుపోయిన‌ అవినీతే అస‌లు కార‌ణం అంటారు.

సాటి సామాజికవర్గానికి చెందిన జయలలిత ప‌ట్ల కూడా అంత‌టి విద్వేషం  క‌న‌బ‌ర‌చే స్వామికి జ‌గ‌న్ అవినీతి ఎందుకు క‌నిపించ‌దు? అన్న  ప్ర‌శ్న‌కు స‌మాధానం  వెత‌కాలి. జ‌గ‌న్ పై ఎంత‌టి అవినీతి ఆరోప‌ణ‌లున్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికీ ఆయ‌న బెయిలుపై తిరుగుతోన్న   అవినీతి కేసుల నిందితుడు. అలాంటి స్వామి క‌నీసం జ‌గ‌న్ మీద రాంగ్ కామెంట్లు కూడా చేయ‌రు.

ఇదే జ‌గ‌న్ తాను క్రిష్టియ‌న్ కావ‌డ‌మే కాదు.. టీటీడీకి కూడా ఒక క్రిష్టియ‌న్ని చైర్మ‌న్ గా చేశారు.  అప్పుడు స్వామికి క‌నీసం నోరు పెగ‌ల‌దు. అంతే కాదు జ‌గ‌న్ ఎప్పుడైనా తిరుమ‌ల‌కు వెళ్తే ఒక క్రిష్టియ‌న్ గా డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌రు. అప్పుడు కూడా స్వామికి ఏదైనా కామెంట్ చేయాల‌న్న ఆలోచ‌న రాదు. జ‌గ‌న్ సాక్షాత్తూ శ్రీవారి ప‌విత్ర‌త‌ను మంట‌గ‌లుపుతూ.. ఇంటి ముందే ఆల‌యం సెట్ వేశారు. అప్పుడు కూడా  స్వామి నోరు మెదపలేదు.

I am a devotee of Lord Venkateswara. Tirumala is not just a temple, it is a national treasure for Hindus,, అని చెప్పే సుబ్ర‌హ్మ‌ణ్య‌ స్వామికి శ్రీవారి భ‌క్తుల‌పైకి చిరుత పులుల‌ను వ‌దులుతుంటే ప‌ట్ట‌దు. ఇక వాటిని త‌ర‌మ‌డానికి చేతి క‌ర్ర‌ల‌ను ఇస్తుంటే చోద్యం చూస్తుంటారు. అదేమంటే శ్రీవాణి విష‌యంలో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌ల గురించి బాబు, ప‌వ‌న్ మాట్లాడితే మాత్రం విరుచుకుప‌డిపోతారు.

క్రిష్టియ‌న్ జ‌గ‌న్ కి బ్రాహ్మిన్ స్వామికీ ఉన్న లింకేంటి? ఇరువురి మ‌ధ్య ఉన్న సంబంధ‌బాంధ‌వ్యాలేంటి?.. శ‌బ‌రిమ‌ల‌, రామ‌సేతు ప‌రిర‌క్ష‌ణ‌పై పిటిష‌న్లు వేసి హిందుత్వం అన్నా హైంద‌వ ఆచార వ్య‌వ‌హారాల‌కు కించిత్ భంగం క‌లిగినా.. కేసుల‌తో విజృంభించే స్వామికి.. తిరుమ‌ల ల‌డ్డూలో నెయ్యి క‌ల్తీ జ‌రిగితే గొడ‌వ‌కు దిగాల్సింది ఎవ‌రితో?  రివ‌ర్స్ లో ఈ విష‌యం వెలుగులోకి తెచ్చిన బాబునే త‌ప్పు ప‌డ‌తారు. ఇదెక్క‌డి విడ్డూరం??? అన్న‌ది శ్రీవారి భ‌క్తుల‌కు వ‌చ్చే అనుమానం. 

టీటీడీ అంటే హిందూ ధార్మిక సంస్థ అయిన‌ప్పుడు అక్క‌డ 2వేల‌కు పైగా అన్య‌మ‌త‌స్తులు ఉద్యోగాలు చేస్తుంటే స్వామికి ఎందుకు ప‌ట్ట‌దు? ఇదే అంశంలో నాటి సీఎస్ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం తీవ్ర స్థాయిలో పోరాడి.. త‌న సీఎస్ వంటి కీల‌క ప‌ద‌విని సైతం కోల్పోయారు. హైంద‌వ ఆల‌యాల్లో అన్య‌మ‌త‌స్తుల‌కు తావు లేద‌న్న పాయింట్ మీద జ‌గ‌న్ తో బ‌రాబ‌ర్ ఫైట్ చేసి.. ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అంతే త‌ప్ప ఎంత‌కీ త‌ల వంచ‌లేదు.

అలాంటి పేరే గ‌ల సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి జ‌గ‌న్ అన్నా, ఆయ‌న పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌న్నా ఎందుకు ప‌ట్ట‌ద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం రావాల్సి ఉంది. ఇదే టీటీడీ గోశాల‌లో స్వ‌దేశీ ఆవులనే ఎక్కువ‌గా పెంచి పోషించాలన్న నిబంధ‌న ఉంది. ఇక్క‌డా ఆ నిబంధ‌న‌ల‌కు తూట్లు పొడుస్తూ.. జ‌గ‌న్ హ‌యాంలో గో.. గోల్ మాల్ జ‌రిగితే.. స్వామికి క‌నీసం ప్ర‌శ్నించాల‌ని అనిపించ‌దు. ఇది ఎందుకో తేలాల్సి ఉంది. 

జ‌గ‌న్ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి మ‌ధ్య ఏవైనా ఒప్పందాలున్నాయా? లేక మ‌రేదైనా  మ‌త‌ల‌బు దాగి ఉందా? ఆ స్వామివారే వెలికి తీయాలి..  త‌మ‌ కూట‌మి  ప్ర‌భుత్వ పాల‌న అన్న క‌నీస కన్సర్న్ లేకుండా స్వామి చేస్తున్న ఈ ఆధ్యాత్మిక విధ్వంసానికి అడ్డుక‌ట్ట ఎప్పుడో కూడా ఆ వెంక‌టేశ్వ‌రుడే చెప్పాల‌ని అంటున్నారు ప‌లువురు శ్రీవారి భ‌క్తులు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.