గండిపేట భూ కుంభకోణం: వెయ్యి కోట్ల దందా వెనుక అసలు కథ!

Publish Date:Jun 13, 2026

Advertisement

తెలుగువన్ ప్రత్యేకం

హైదరాబాద్ మహానగర శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట ప్రాంతంలో వెలుగుచూసిన వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  మాజీ ప్రజాప్రతినిధి  వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు,  అతని సోదరుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో ఈ భారీ దందా అసలు రంగు బయటపడింది. గండిపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు తొమ్మిదిన్నర ఎకరాల విలువైన భూమిని అక్రమంగా కబ్జా చేశారనే బలమైన ఆరోపణలు వీరిపై వచ్చాయి. ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో  వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.   సెక్రటేరియట్ ఉద్యోగిగా చలామణి అయిన ఒక మధ్యవర్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భరద్వాజ చెప్పారు. ప్రభుత్వ భూమిని క్లీన్ డాక్యుమెంట్లతో మీ చేతికి అందిస్తానని సదరు మధ్యవర్తి నమ్మించడంతో, అతనికి నేరుగా నాలుగు కోట్లు చేతులు మారాయని పోలీసులు చెబుతున్నారనీ, మరో వైపు . తాము మోసపోయామని సదరు మాజీ ప్రజాప్రతినిధి వాదిస్తున్నారనీ భరద్వాజ అన్నారు. , అసలు ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అక్రమ మార్గాల్లో రెగ్యులరైజేషన్ కోసం కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, మేమే ఇక్కడి భూములకు రక్షకులమని చెప్పుకునే కొందరు తెలంగాణ వాదులు పూర్తిగా మౌనం వహించడం విశేషమన్నారు. గతంలో కోడి చెరువు లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి చిన్న చిన్న భూ వివాదాలపై తీవ్రంగా స్పందించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన నాయకులు, ఇంత పెద్ద  ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని  ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ సమయం నుండి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కలుపుకొని కబ్జా చేసే సరికొత్త వ్యూహానికి తెరలేచింది.

ఈ రకమైన కబ్జాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. గండిపేటతో పాటు పటాన్‌చెరు మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెజారిటీ ప్రైవేట్ లేఅవుట్లలో, విల్లాల్లో, ఫార్మా కంపెనీల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కలిసిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' ( ద్వారా మరియు ధరణి రికార్డుల దర్యాప్తు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తోంది. తెలంగాణ నిజమైన ధనిక రాష్ట్రంగా ఎదగాలంటే, ఇప్పటికైనా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, గత ముప్పై ఏళ్లుగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల చిట్టాను పూర్తిగా బహిర్గతం చేయాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిన ఈ వేల కోట్ల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి మరియు ప్రజా సంక్షేమానికి ఉపయోగించినప్పుడే ఈ భూ దందాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది.

ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యస్ చానెల్ లో వీక్షించండి

 

By
en-us Political News

  
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.