ఐఆర్‌సీటీసీ సీఎండీ సంజయ్ కుమార్ జైన్ రాజీనామా!

Publish Date:Jun 24, 2026

Advertisement

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)  ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండి) సంజయ్ కుమార్ జైన్ తన పదవికి  రాజీనామా చేశారు. కోట్లాది మంది ప్రయాణికులకు సేవలందిస్తూ, రైల్వే టికెటింగ్ మరియు పర్యాటక రంగంలో తిరుగులేని నమ్మకాన్ని సంపాదించుకున్న ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌సీటీసీలో  సంజయ్ కుమార్ జైన్ రాజీనామా సంచలనంగా మారింది.  తన రాజీనామాకు   వ్యక్తిగత కారణాలు అంటూ ఆయన పేర్కొన్నారు. ఇలా ఉండగా  ఆయన రాజీనామాను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది. అయితే ఆయన వచ్చే నెల 20 వరకూ విధుల్లో కొనసాగుతారు.  

సంస్థలో బాధ్యతల బదిలీ ప్రక్రియలో అడ్డంకులు లేకుండా,   సజావుగా సాగేందుకు వీలుగా సంజయ్ కుమార్ జూలై  20 వరకు ఆయన సీఎండీగా కొనసాగుతారని రైల్వే వర్గాలు తెలిపాయి.  ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి జూన్ 22నే తమకు అధికారిక లేఖ అందినట్లు ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్‌లో సంస్థ అధికారికంగా వెల్లడించింది. తదుపరి సీఎండీగా ఎవరు రానున్నారు, లేదా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు అనే విషయాలపై త్వరలోనే స్పష్టమైన ఉత్తర్వులు జారీ కానున్నాయి.

సంజయ్ కుమార్ జైన్   1990 బ్యాచ్‌కు చెందిన  ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్  అధికారి. రైల్వే రంగంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన.. 2024 ఫిబ్రవరిలో ఐఆర్‌సీటీసీ సీఎండీగా   బాధ్యతలను స్వీకరించారు.  ఆయన నాయకత్వంలో ఐఆర్‌సీటీసీ  మినీరత్న నుంచి నవరత్న స్థాయికి ఎదిగింది. అలాగే..  ప్రభుత్వ రంగ సంస్థల అత్యున్నత వర్గీకరణ జాబితాలో  షెడ్యూల్ బి  నుంచి  షెడ్యూల్ ఎ  ఎదిగింది.   ఆయన హయాంలో ఐఆర్‌సీటీసీ డిజిటల్ సేవల విస్తరణ,   రైల్వే క్యాటరింగ్ నాణ్యతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 

By
en-us Political News

  
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ Oracle ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు ఆటోమేషన్ కారణంగా భారతీయ ఐటీ రంగం, ఫ్రెషర్స్ మరియు మిడ్లె వల్ మేనేజర్లపై పడనున్న ప్రభావం, మరియు మీ కెరీర్ కాపాడుకోవడానికి అవసరమైన టాప్ AI స్కిల్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఒక క్రైమ్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఘోర హత్యోదంతంలో రోజుకో సంచలన వాస్తవం వెలుగులోకి వస్తున్నది.
2026 జూన్ 25 లేదా 26 తేదీలలో మొహర్రం బ్యాంక్ సెలవు ఎప్పుడు? హైదరాబాద్, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో వరుసగా 3 రోజులు బ్యాంకులు ఎందుకు మూతపడనున్నాయో ఆర్‌బీఐ (RBI) అధికారిక సెలవుల జాబితా ద్వారా ఇప్పుడే తెలుసుకోండి.
ఆర్‌బీఐ కొత్త ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల వల్ల టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్ అయ్యే అవకాశాలు పెరిగాయి. దీనితో టాటా కెమికల్స్ షేర్లు 4 శాతం పెరిగి రూ. 770 కి చేరాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ ముఖ్య గమనింపు. తిరుపతిలో ఇచ్చే ఉచిత టైమ్ స్లాట్ సర్వ దర్శనం (SSD) టోకెన్ల పంపిణీ సమయాలను మారుస్తూ TTD కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కొత్త సమయాలు మరియు మూడు ప్రధాన కౌంటర్ల పూర్తి వివరాలు మీకోసం.
భారత క్రికెట్ క్రేజ్ ఇప్పుడు బిజినెస్ పవర్‌గా మారింది. బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 నివేదికలో తొలిసారిగా కేకేఆర్, సీఎస్‌కే, ఆర్‌సీబీ సహా ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలు దేశంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల సరసన స్థానం సంపాదించాయి. ఈ జట్ల మొత్తం విలువ, వాటి ర్యాంకులు మరియు ఆదాయ వనరుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక, యశస్వి జైస్వాల్ తొలగింపుపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ బీసీసీఐ సెలెక్టర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2027 వరల్డ్ కప్ విజన్ ఏంటని ప్రశ్నించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల పసిడిపై భారీగా తగ్గిన హైదరాబాద్, విజయవాడ మరియు ఢిల్లీ నగరాల తాజా రేట్లను ఇక్కడ చూడండి.
వాటర్‌వేస్ లీజర్ (కార్డెలియా క్రూయిజెస్) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నేటితో (జూన్ 25) ముగియనుంది. ప్రైస్ బ్యాండ్, అలాట్‌మెంట్ తేదీ మరియు ఇన్వెస్టర్లు చేయకూడని తప్పుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ తీరంలోని మొరాన్ నగరానికి సమీపంలో, భూగర్భంలో 10 నుండి 22 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాలు ఉన్నాయి. వందేళ్లలో వెనిజులాలో సంభవించిన భారీ భూకంపాలు ఇవేనని అధికారులు తెలిపారు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) భీమ్ యాప్ వినియోగదారుల కోసం రుణాలు, పింఛన్లు, ఇన్సూరెన్స్ వంటి సరికొత్త సేవలను ప్రవేశపెడుతోంది. గడిచిన ఏడాదిలో మూడు రెట్లు లావాదేవీల వృద్ధితో దూసుకుపోతున్న భీమ్ యాప్ పూర్తి వివరాలు మీకోసం.
హైదరాబాద్ మేడిపల్లిలో జరిగిన HMDA ప్లాట్ల ఈ-వేలానికి కొనుగోలుదారుల నుండి భారీ రెస్పాన్స్ లభించింది. 63 ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 120 కోట్ల ఆదాయం వచ్చింది. పూర్తి వివరాలు, చదరపు గజం ధరల వివరాలు ఇక్కడ చదవండి.
ఈ నిధుల వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రామ్ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరస్పరం విరుద్ధమైన ప్రకటనలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. ఒకవైపు సీఎం యోగి ఈ నిధుల గోల్ మాల్ ను అయోధ్య ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తుంటే.. మరోవైపు రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఇది ముమ్మాటికీ బహిరంగ దోపిడీ అని కుండబద్దలు కొట్టారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.