Publish Date:Apr 12, 2026
ఐపీఎల్ 2026 సీజన్ పరుగుల పండుగగా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ముంబై ఇండియన్స్‌తో (ఎమ్ఐ) మధ్య జరిగిన మ్యాచ్ లో రెండు జట్లూ కలిపి ఏకంగా 462 పరుగులు చేశాయి. 40 ఓవర్లలో ఈ స్థాయిలో పరుగులు వచ్చాయంటే.. బ్యాటర్ల విధ్వంసం ఏ రీతిలో ఉందో అర్ధమౌతుంది.
ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటీదార్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫిల్ సాల్ట్ కేవలం 36 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 78 పరుగులు సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో 38 బంతుల్లో సరిగ్గా హాఫ్ సెంచరీ చేశాడు.
స్కిప్పర్ రజత్ కేవలం 20 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 53 పరుగులు చేశారు. ఆ తరువాత జితేశ్ శర్త విఫలమైనా, టిమ్ డేవిడ్ 34 పరుగులతో రాణించడంతో.. ఆర్సీబీ భారీ స్కోరు సాఆధించింది. ఇక ఛేదనలో ముంబై ఇండియన్స్ జట్టు తగ్గేదే లే అన్నట్లుగా ఆడింది. ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
అయితే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ముంబై ఇండియన్స్ విజయానికి 18 పరుగుల దూరంలో ఆగిపోయి.. ఈ సిజన్ లో మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై జట్టులో రూథర్‌ఫర్డ్ 31 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. అంతకు ముందు ధాటిగా ఆడుతున్న రోహిత్ శర్మ వ్యక్తిగత స్కోరు 19 వద్ద ఉండగా తొడ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ కావడంతో ముంబై ఛేదనలో విఫలమైందని చెప్పవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rcb-versus-mi-runs-feast-36-217212.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే