తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని దిక్కు తోచక అల్లాడుతున్న తెలంగాణకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. బాండ్ల విక్రయాల ద్వారా నాలు వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకు ఆర్బీఐ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాభివృద్ధి రుణాలకు అనుమతిస్తూనే ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధికి లోబడే రుణ సమీకరణ చేసుకోవాలని ఆర్బీఐ షరతు విధించింది. ఇలాంటి అనుమతులనే ఏపీకి మహారాష్ట్రకు తమిళనాడుకు కూడా ఇచ్చింది. తెలంగాణకు 13ఏళ్ల కాలపరిమితితో రూ.4 వేల కోట్ల రుణాల సమీకరణకు ఆమోదం తెలిపింది.
జూన్ 7న ఉదయం 10.30గంటల నుంచి 11.30గంటల మధ్య బాండ్ల వేలం నిర్వహించి రూ.4 వేల కోట్ల నిధుల సమీకరణకు తెలంగాణకు ఆర్బీఐ షెడ్యూల్ జారీ చేసింది. ఏ రాష్ట్రమైనా తన జీఎస్డీపీలో 35శాతం మేర అప్పు తీసుకునేందుకు వీలుంది. ఆ మేరకు 42,728 కోట్ల అప్పులకు అవకాశం ఉంది. అయితే అయితే వివిధ ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాలకు గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రూ.లక్షా 30 వేల కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామని కేంద్రం షరతు విధించింది.
దీంతో 17 కార్పొరేషన్లకు చెందిన ఆదాయ వ్యయాలు, వాటి అప్పుల వివరాలను కేంద్రానికి తెలంగాణ సమర్పించింది. వీటి చెల్లింపులను రాష్ట్ర బడ్జెట్ నుంచే నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటిని రాష్ట్ర అప్పులగానే కేంద్రం పేర్కొని గడచిన రెండు నెలల రుణ సేకరణను ఆర్బీఐ నిలిపివేసిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో సర్కార్ ముమ్మరంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రుణ సేకరణ, ప్రస్తుత అవసరాలు, ఎఫ్ఆర్బీఎం చట్టం, తెలంగాణ జీఎస్డీపీ వంటి అంశాలను వెల్లడించడంతో తెలంగాణ సర్కార్‌పై రుణసమీకరణ ఆంక్షలను తాత్కాలికంగా ఉపసంహరించుకుంది.ఆర్బీఐ తాజా నిర్ణయంతో తెలంగాణ సర్కార్‌కు కొండంత ఊరట లభించినట్లైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rbi-allows-telangana-to-take-loabs-through-bands-auxtion-39-136996.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.