సంబరాల నుంచి సైలెంట్.. తెలంగాణ బీజేపీ దూకుడుకు బ్రేక్? అంతా కేంద్రం వల్లే..

Publish Date:Aug 30, 2020

Advertisement

తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ.. కొన్ని రోజులుగా దూకుడు పెంచింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి వచ్చే ఏ  ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. కరోనా భయపెడుతున్నా ప్రజా సమస్యలపై స్పీడ్ గా స్పందిస్తోంది బండి సంజయ్ టీమ్. ఎక్కడ సమస్య ఉన్నా.. అక్కడికి వెళ్లి సర్కార్ తీరును ఎండగడుతున్నారు కమలనాధులు. సంజయ్ స్పీడ్ తో బీజేపీ కేడర్ లోనూ జోష్ పెరిగింది. ప్రజా పోరాటంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నాబీజేపీ ముందుందనే చర్చ జనాల్లోనూ జరుగుతోంది. ఏపీతో జరుగుతున్న జల వివాదంతో మొదట కేంద్రం స్పందన తెలంగాణ బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. కేంద్రం ఏపీ ప్రభుత్వానికి వరుస లేఖలు రాయడంతో సంజయ్ టీమ్ సంబరాలు చేసుకుంది. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగల్లేదు. ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం యూ టర్న్ తీసుకోవడంతో సంబరాలు చేసుకున్న తెలంగాణ బీజేపీ నేతలే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. 

 

కృష్ణా జల వివాదం, ఏపీ సర్కార్ కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందని బహిరంగా ప్రకటనలు చేశారు. అంతేకాదు కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ మొదట మౌనంగా ఉండటంతో... ఇదే అస్త్రంగా టీఆర్ఎస్ సర్కార్ పై దాడికి దిగారు తెలంగాణ బీజేపీ నేతలు. టీఎస్ నేతల ఫిర్యాదుపై కేంద్రం కూడా వేగంగానే స్పందించింది. రాయలసీమ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరపడ్డారు. తమ పోరాటం వల్లే ఏపీ ప్రాజెక్టులకు బ్రేక్ పడిందని చెప్పుకున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని, తామే పాలమూరు రైతులకు నష్టం జరగకుండా చూశామని గొప్పలు చెప్పుకున్నారు. జల వివాదంలో బండి సంజయ్ టీమ్ పోరాటానికి తెలంగాణ ప్రజల్లో మైలేజీ కూడా వచ్చినట్లు కనిపించింది. ఇదే స్పూర్తిగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలంగాణ కమలనాధులు కార్యాచరణ రచించారు. 
          

అయితే తెలంగాణ బీజేపీ నేతల స్పీడ్ కు బ్రేకేసింది కేంద్ర సర్కార్ తాజా నిర్ణయం. 
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో జరుగుతున్న విచారణలో.. ఏపీ వాదనను సమర్ధించేలా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమేనని స్పష్టం చేసింది. దానివల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని తెలిపింది. ప్రాజెక్ట్ కు  పర్యావరణ అనుమతులు అవసరం లేదని  క్లారిటీ ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని వెల్లడించింది. ఎన్జీటీలో కేంద్రం వేసిన అఫిడవిట్ తో తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ తగిలింది. ఇంతకాలం తామే కేంద్రానికి ఫిర్యాదు చేసి ఏపీ ప్రాజెక్టులను అడ్డుకున్నామని చెప్పి న నేతలు... ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కేంద్రం అఫిడవిట్ తో తాము చేస్తున్న పోరాటమంతూ బూడిదలో పోసిన పన్నీరులా మారిందని  ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే మంచి అవకాశం కోల్పోయామని చెబుతున్నారు. పార్టీ దూకుడుకు వెళుతున్న సమయంలో ఇలా జరగడమేంటనీ తెలంగాణ కమలనాధులు మధనపడుతున్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ స్కీంపై తెలంగాణ బీజేపీ నేతలు అత్యూత్సాహం ప్రదర్శించారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.  రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు జాతీయ పార్టీ నేతలు ఆచితూచి వ్యవహరించాలని, దూకుడుగా వెళితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.