మళ్లీ ఫ్యాక్షన్ పడగలోకి రాయలసీమ? అరాచకాలకు అడ్డాగా జగన్ రెడ్డి పాలన ? 

Publish Date:Jan 2, 2021

Advertisement

మూడు మర్డర్లు.. ఆరు అటాక్ లు.. తొమ్మిది దొమ్మీలు. ఇదీ ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి. ఫ్యాక్షన్ పడగలో,  కక్ష్య రాజకీయాలతో తల్లడిల్లింది ఆ సీమ. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ లబ్ది కోసం ఫ్యాక్షన్ ను పెంచి పోషించారు అక్కడి నేతలు. దివంగత నందమూరి తారక రామారావు  రాజకీయ ప్రవేశంతో  రాయలసీమ ఊపిరి పీల్చుకుంది. ఎన్టీఆర్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, అభివృద్ధి నినాదంతో 
రాయలసీమ ఫ్యాక్షన్ కు దూరంగా ప్రశాంత సీమగా మారిపోయింది. తర్వాత చంద్రబాబు పాలనలోనూ రాయలసీమలో  ఫ్యాక్షన్ ను చోటు లేకుండా పోయింది. హత్యా రాజకీయాలు మాని అభివృద్ధి కోసం పని చేశారు ప్రజా ప్రతినిధులు. అయితే కొన్ని రోజులుగా రాయలసీమలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న రాయలసీమ జగన్ రెడ్డి పాలనలో మళ్లీ ఫ్యాక్షన్ పడగ నీడలోకి వెళ్లింది. అధికార పార్టీ నేతలు బరి తెగింపుతో  సీమలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ప్రత్యర్థి పార్టీల నేతలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రజలను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. దాడులకు తెగబడుతున్నారు. హత్యలకు పాల్పడుతూ జనాల్లో భయాందోళన స్పష్టిస్తున్నారు. 

కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం.. ఏ జిల్లా చూసినా ఇదే పరిస్థితి. రోజూ ఏదో ఒక చోట ప్యాక్షన్ గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  రాజకీయ కక్షలతోనే .. ఇతర పార్టీల సానుభూతిపరులనే కారణంతోనో.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనో.. విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు దుండగులు. దీంతో ప్రజలు ప్రాణాలు అర చేతిలో  పట్టుకుని జీవించాల్సిన పాత రోజులు రాయలసీమలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పట్టపగలే జరిగిన టీడీపీ నేత హత్య తీవ్ర కలకలం రేపింది.  ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యక్రమంలో ఇళ్ళపట్టాల పంపిణీ  వద్ద అందరు చూస్తుండగానే దుండగులు సుబ్బయ్యను హతమార్చారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిథిగా ఉన్న సుబ్బయ్యను రాజకీయ కక్షలతోనే ప్రత్యర్థులు హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.  ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌ లో  స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పాత్రను,  అవినీతిని తన ప్రెస్ మీట్ల ద్వారా బట్టబయలు చేశాడన్న అక్కసుతోనే సుబ్బయ్యను కిరాతకంగా హత్య చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పోలీసులు అక్కడ ఉండగానే.. టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో  ఊహించవచ్చు. 

 అనంతపురం జిల్లా  వైసీపీ నేతల అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. పోలీసుల అండతో ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వందలాది మంది అనుచరులతో కలిసి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. జేసీ వద్ద పనిచేసే కిరణ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి... తన అనుచరులతో కలిసి జేసీ నివాసంపై దండెత్తారు. అక్కడే ఉన్న కిరణ్ అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. జేసీ నివాసంలోకి ప్రవేశించిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డి కుర్చిలో కూర్చొని హంగామా చేశారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి ఘటనే నిదర్శనమనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగడం రాష్ట్ర చరిత్రలో లేదని చెబుతున్నారు. గతంలో ఫ్యాక్షన్ గొడవలు జరిగినా.. ఇలా ఒక ఎమ్మెల్యే వందలాది మందిని తీసుకుని మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం ఎప్పుడు జరగలేదంటున్నారు. ఏపీలో  రూల్ ఆఫ్ లా లేదనడానికి ఈ ఘటన ఉదాహరణ అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

 అంధ్రప్రదేశ్ లో దళితులపై నేరాలు గణనీయంగా పెరిగాయని పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. అనంతపురం జిల్లాలో దళిత జడ్జీ రామకృష్ణ కుటుంబ సభ్యులపైనే  దాడి జరిగింది. ఒక జడ్జీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉంటే.. మిగితా దళితుల భద్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.  జగన్ రెడ్డి పాలనలో అధికారులకు రక్షణ లేకుండా పోయింది. తాము చెప్పినట్లు వినకపోతే అధికారులపైనా దాడులకు తెగబడుతున్నారు. బెదిరించి వారిని దారిలోకి తెచ్చుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులపై అధికార పార్టీ నేతల దాడులు జరుగుతూనే ఉండగా.. తాజాగా  గుంటూరు శివారులోని నల్లపాడుకు చెందిన వైసీపీ నేత గాదె నాగిరెడ్డి.. కరెంట్ బిల్లు కట్టమన్న లైన్ మైన్ పై తీవ్రంగా కొట్టడం దుమారం రేపింది. ఆరు నెలలుగా కరెంట్ బిల్లు కట్టకపోవడంతో వైసీపీ నేత పేరు డీఫాల్ట్ లిస్టులోకి వెళ్లిపోయింది. లైన్ మైన్ కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. దీంతో లైన్  మెన్ ను ఇంటికి పిలుపించుకుని మరీ కొట్టాడు వైసీపీ నాయకుడు.  

 రాయలసీమలో  జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. మళ్లీ పాత రోజులు వచ్చాయని వారంతా భయపడుతున్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా? అని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. రాష్ట్రాన్ని మారణాయుధాలతో పాలిస్తారా? అని నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో ఎవరి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని.. ఎప్పుడు ఎవరిని హత్య చేస్తారో, ఏ ఆడబిడ్డపై అత్యాచారానికి పాల్పడతారో, ఎవరి ఇంటిపై దాడి చేస్తారో అని జనం భీతిల్లే పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వస్తున్నాయి.  ఏపీలో వైసీపీ నేతలే  విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతూ భయానక పరిస్థితులు నెలకొల్పారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

By
en-us Political News

  
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.