నడుస్తున్న రైలులో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. సంబల్ పూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రక్సౌల్ ఎక్స్ ప్రెస్ ఈ దారుణం చోటు చేసుకుంది. కుటుంబంతో కల్సి వస్తున్న ఆ బాలిక తనను విధి కాటేస్తుందని ఊహించలేకపోయింది. హార్రర్ సినిమాలను తలపించే ఈ సంఘటన అనేక ప్రశ్నలు తలెత్తేలా చేసింది. మరి కొద్ది సేపట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని బాలిక కుటుంబం భావించింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. రైలు కెల్తార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగానే బాలిక కాల కృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లింది. తెల్లవారు జామున తోటి ప్రయాణికులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు. బాలిక కుటుంబ సభ్యులు కూడా నిద్రలో జారుకోవడాన్ని నిందితుడు సంతోష్ కుమార్ (21) పసిగట్టాడు. నిందితుడు బీహార్ మంద్వాడ్ జిల్లాలో రైలెక్కాడు. అప్పటివరకు ఈ కుటుంబ సభ్యులతో మాటా మాటా కలపడంతో బాలిక కూడా ప్రమాదాన్ని ఊభించలేకపోయింది. బాలిక టాయ్ లెట్ కు వెళ్లగానే వెంబడించి అదే టాయ్ లెట్ డోర్ వేసేసాడు. బాలిక అరుస్తున్నప్పటికీ కేకలు భోగీలో వినిపించలేదు. బలవంతంగా రేప్ చేసిన యువకుడు ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించి వదిలేసాడు. విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే 139 హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో రైల్వే పోలీసులు చేరుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్స్ కేసు నమోదైంది.అమ్మాయిలపై అత్యాచారాలు జరిగినప్పుడు నేరస్తులకు శిక్షలు కఠినంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో పోక్సో చట్టాన్ని పాలకులు తీసుకువచ్చారు అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ నేరాలు చేసే వాళ్లు నేరాల తీరు మార్చుకుంటున్నారే గానీ నేరాలను నియంత్రించుకోలేకపోతున్నారు. చట్టాలలో ఉన్న లొసుగులు వారికి వరప్రదాయిని అవుతుంది. పిల్లల పెంపకంలో కూడా లోపాలు వారిని సమాజంలో నేరస్థులుగా నిలబెడుతున్నాయి. దిశ, నిర్బయ, పోక్స్ చట్టాలు వారిలో మార్పు తేలేకపోతున్నాయి. నేరాల శాతం తగ్గుతున్నా నేరాలను అరికట్టడంలో చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా విఫలం అవుతున్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rape-in-a-moving-raxaul-express-press-bhogi-39-195651.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.