రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల రేప్ సంఘటనలు మరవకముందే గచ్చిబౌలిలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెకర్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత యువతి పుప్పాలగూడలోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్ధార్థ వర్మ మరో యువతి ద్వారా బాధితురాలిని పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. బుధవారం ఆమెను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి తాగించి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిద్ధార్థ వర్మను అరెస్టు చేశారు.
మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళలను ఒంటరిగా చూస్తే చాలు, వారిపై దౌర్జన్యాలకు, అత్యాచారాలకు కొందరు కీచకులు పాల్పడుతున్నారు. ఈ నేరాలను అరికట్టేందుకు సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటున్నా, నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రెండు దారుణాలు బాధితుల ఫిర్యాదులతో వెలుగుచూశాయి. మంగళవారం నాడు కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెలుతున్న మహిళపై ఆఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో, అప్రమత్తమైన సిటీ పోలీస్. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేజ్ చేసి పట్టుకున్నారు. కాగా డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్దయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వివరించారు.అదే రోజు హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన సైతం చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుడు అత్యాచారం చేసిన ఉదంతం బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. వరుసగా రెండు రోజుల వ్యవధిలో హైదరాబాద్ లో మూడు రేప్ కేసులు నమోదు కావడం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rape-by-the-director-of-a-short-film-on-a-software-engineer-in-hyderabad-25-181987.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.