షరతులన్నిటికీ ఇరాన్ ఒప్పుకుంది.. డొనాల్డ్ ట్రంప్.!
Publish Date:Jul 2, 2026
Advertisement
ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు ముగింపు దశకు వచ్చాయని అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా విధించిన ప్రతి నిబంధనకు ఇరాన్ దాదాపు అంగీకరించిందన్న ఆయన.. ఇరాన్ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రముఖ అంతర్జాతీయ ఛానల్ సీఎన్‌బీసీ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్‌ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చడమే తమ అంతిమ వ్యూహమని.. ప్రస్తుత చర్చలు అమెరికాకు అనుకూలంగా సాగుతున్నాయని చెప్పారు. ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నాం.. మేం చెప్పిన, అడిగిన ప్రతిదానికి వారు దాదాపు అంగీకరించారని ట్రంప్ విస్పష్టంగా పేర్కొన్నారు. ఇరాన్‌లో తాము అధికార మార్పిడి ఆశించడం లేదని, కేవలం అణ్వాయుధాలు నివారించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఇరాన్ జరిపిన దాడులకు అమెరికా దీటుగా సమాధానం చెప్పిందన్న ట్రంప్.. గత వారం ఒక నౌకపైకి వారు డ్రోన్‌ను పంపినందుకు మేము మూడు సార్లు తీవ్రమైన దాడులు చేశామనీ, . అంతకుముందు వారం కూడా వరుసగా మూడు రాత్రులు ఇరాన్ పై విరుచుకుపమనీ చెప్పారు. ఇరాన్‌పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచడానికి అమెరికా నౌకాదళం ఐరన్ వాల్ లాంటి దిగ్బంధనాన్ని విధించిందనీ, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా నావికాదళం కారణంగా ఒక్క నౌక కూడా ఇరాన్‌కు చేరుకోలేకపోయిందనీ వివరించారు. , దీనివల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని, అక్కడ 300 శాతం ద్రవ్యోల్బణం నెలకొందని ట్రంప్ చెప్పారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం రహస్యంగా అంతర్జాతీయ నౌకలకు రక్షణ కల్పిస్తూ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిందని, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా అడ్డుకోగలిగామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఒకవేళ చర్చలు సఫలమై ఇరాన్‌తో పూర్తిస్థాయి ఒప్పందం కుదిరితే, అమెరికా రైతుల నుండి ఇరాన్‌కు వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్ధంగా ప్రకటించిన ఆయన.. ఇరాన్‌కు ప్రస్తుతం ఆహారం అవసరం, వారికి కావలసిన మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి నిత్యావసరాలను కేవలం అమెరికన్ రైతుల నుండే ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తాను రెండవసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా జరిపిన సైనిక చర్యల వల్ల ఇరాన్ రక్షణ సామర్థ్యం పూర్తిగా దెబ్బతిందన్న ట్రంప్ అమెరికా ఇరాన్ ను పూర్తిగా ఓడించిందనీ.. ఇప్పుడు ఆ దేశానికి కేవలం కొన్ని క్షిపణులు మాత్రమే ఉన్నాయని చెప్పిన ట్రంప్.. తలుచుకుంటే.. వాటిని కూడా తుడిచిపెట్టేయగలమన్నారు.
http://www.teluguone.com/news/content/ran-has-agreed-to-all-the-conditions-36-224906.html





