బీజేపీకి రాములమ్మ గుడ్ బై.. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న విజయశాంతి!

Publish Date:Nov 16, 2023

Advertisement

చివరకు అనుకున్నదే అయ్యింది.   బీజేపీకి రాములమ్మ విజయశాంతి గుడ్ బై చెప్పేశారు.   తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. శుక్రవారం(నవంబర్ 17) తెలంగాణ పర్యటనకు  రానున్న కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ సమక్షంలో, విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. దీనితో సుదీర్ఘకాలం బీజేపీలో ఆమె పోషించిన పాత్ర ముగిసిపోయింది. అయితే రాములమ్మ రాజీనామా విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

తెలంగాణ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపి విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తారని చాలా కాలంగా వినిపిస్తున్నా, బీజేపీ హైకమాండ్ తీరు పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆమె చేష్టల ద్వారా స్పష్టమౌతున్నా, అమెతో మాట్లాడేందుకు కానీ, ఆమె ఆగ్రహం లేదా అసంతృప్తికి కారణమేమిటో తెలుసుకుని పరిష్కరించేందుకు కానీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇసుమంతైనా చొరవ చూపకపోవడం పార్టీ శ్రేణులలో అసంతృప్తికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తన సేవలు వినియోగించుకోని పార్టీ నాయకత్వంపై ఆమె చాలాకాలం నుంచి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ మేరకు సందర్భం వచ్చినప్పుడల్లా ట్వీట్లు చేసి, పార్టీని ఇరుకున పెట్టినా, నాయకత్వం ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణకు ఇద్దరు ముగ్గురు ఇన్చార్జిలు ఉన్నప్పటికీ, వారెవరూ ఆమెతో మాట్లాడి అసంతృప్తి చల్లార్చే ప్రయత్నాలు చేయలేదు. ఆ క్రమంలో ఆమెకు ఆందోళన కార్యక్రమాల కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినప్పటికీ అది.. రాములమ్మలోని అసంతృప్తిని ఇసుమంతైనా తగ్గించలేదు.  

నిజానికి విజయశాంతి సేవలు వినియోగించుకోవడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జనంలో ఆమెకునన ఇమేజ్, సినీ గ్లామర్, ముక్కుసూటిగా కేసీఆర్ పాలనను నిర్భయంగా విమర్శలు చేసే ప్రసంగాలు తెలంగాణ ప్రజలకు సుపరిచితాలే. అటువంటి విజయశాంతి సేవలను బీజేపీ వినియోగించుకు ఉండి ఉంటే.. పార్టీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండి ఉండేది కాదనీ.. పార్టీ క్యాడర్ బాహాటంగానే చెబుతోంది.     బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమెకు పార్టీలో సముచిత గౌరవం లభించేది. అయితే కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమెను పట్టించుకోవడమే మానేసి పూర్తిగా పక్కన పెట్టారనీ, ఇదే ఆమె పార్టీ నుంచి వైదొలగడానికి కారణమని పార్టీ వర్గాలే అంటున్నాయి.  కిషన్ రెడ్డి వ్యవహారశైలిపై ఆమె పలు మార్లు పార్టీ నేతల వద్ద అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. అసలు మొదట్టో విజయశాంతిని కేటీఆర్ పై సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న చర్చ జరిగింది. అందుకు విజయశాంతి అంగీకారం కూడా తెలిపారు. కానీ  చివరి జాబితాలో కూడా తన పేరు లేకపోవడం, లోక్‌సభ ఎన్నికల్లో పోటీపైనా స్పష్టత ఇవ్వకపోవడంతోనే విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పేశారని అంటున్నారు. 

కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకార సభకు హాజరైన మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రాకను ఆక్షేపిస్తూ, విజయశాంతి అర్ధంతరంగా సభ నుంచి నిష్క్రమించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘తెలంగాణకు అడ్డుపడ్డ వారితో వేదిక పంచుకోవడం ఇష్టం లే కనే వెళ్లిపోయానంటూ ఆమె  చేసిన ట్వీట్ పై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార సభకు ఆహ్వానించి వేదికపై చోటు ఇవ్వడాన్ని విజయశాంతి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెకు పార్టీలోని పలువురు మద్దతు తెలిపారు కూడా. అయితే పార్టీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో ఆమె విసిగిపోయారని అంటున్నారు. అందుకే   ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ, వారిని విజయశాంతి కలవలేదని అంటున్నారు. దీంతొ అప్పుడే విజయశాంతి పార్టీ మారుతారన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

కాగా విజయశాంతి నిష్క్రమణతో బీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే బలమైన నేతలందరికీ బీజేపీ పొమ్మనలేక పొగబెడుతోందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.  కేటీఆర్‌తోపాటు, కీలకమైన మంత్రులపై బలమైన అభ్యర్ధులను పోటీకి దింపకపోవడం, టికెట్లు తీసుకున్న అభ్యర్ధులు.. బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు ఎక్కడా ఇబ్బంది కలిగించకపోవడం, అసలు చాలామంది అభ్యర్ధులు ప్రచారపర్వంలోనే నాన్ సీరియస్ గా ఉండటం వంటి కారణాలతో ఈ అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.