ఎవరిని వదలడా.. ఎమ్మెల్యే కొడుకు ఇంత దుర్మార్గుడా! రామకృష్ణ సెల్ఫీ వీడియోలో సంచలనాలు..
Publish Date:Jan 5, 2022
Advertisement
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అనేక ట్విస్టులు బయటికి వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు చుట్టూ ఉచ్చు బిగుస్తుండగా తాజాగా, ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చి ప్రకంపనలు రేపుతోంది. రామకృష్ణ ఈ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని రామకృష్ణ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదమని, ఆయనను ఎదగనివ్వొద్దని కోరారు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడినని, కానీ ఆయన ఏ భర్త వినకూడని మాటను అడిగారని వాపోయారు. తన భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారని కన్నీళ్లు పెట్టుకున్నారు రామకృష్ణ. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని అన్నారు. నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు. వనమా రాఘవ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని రామకృష్ణ గుర్తు చేశారు. ఎవరి వద్దకు వెళ్లినా కూడా ఎవరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేరని రాఘవేందర్ తనను బెదిరించినట్టుగా రామకృష్ణ వివరించారు. ఎదుటి మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి రాఘవేందర్ తన పబ్బం గడుపుకొంటున్నాడని రామకృష్ణ చెప్పారు. తన భార్యను తీసుకొని హైద్రాబాద్ కు రావాలని వనమా రాఘవేంద్ర ఆర్ఢర్ వేశాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేందర్ తీరుతోనే తాము ఆత్మహత్య చేసకోవాలని నిర్ణయం తీసుకొన్నామని రామకృష్ణ వివరించారు.తాను ఒక్కడిని వెళ్లిపోతే (ఆత్మహత్య చేసుకుంటే) తన భార్య, పిల్లలను ఆయన వదిలిపెట్టరని, అందుకనే తనతోపాటు వారినీ తీసుకెళ్తున్నానని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పారు. అప్పుల్లో కూరుకుపోయిన తనపై తన తల్లి, సోదరి కక్ష సాధించారని రామకృష్ణ ఆ సెల్ఫీ వీడియోలో వివరించారు. వనమా రాఘవేందర్ వల్లే ఇటీవలనే పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుతో నెల రోజుల పాటు బయటకు రాకుండా ఉన్న రాఘవేందర్ ప్రస్తుతం తనను వేధిస్తున్నాడని రామకృష్ణ ఆవేదన చెందారు. నేను ఒక్కడినే చనిపోతే నా భార్య పిల్లలను వదిలి పెట్టడు, వనమా రాఘవేందర్ బారిన పడకుండా తన భార్యా పిల్లలను కూడా తీసుకెళ్తున్నానని రామకృస్ణ ఆ సెల్పీ వీడియోలో పేర్కొన్నారు. రాఘవేందర్ వల్ల పట్టణంలో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కొందరు బయటకు వచ్చి చెప్పుకొన్నారు, మరికొందరు బయటకు రాలేదని రామకృష్ణ వివరించారు.తాను ఎలాంటి వాడినో, వనమా రాఘవేందర్ ఎలాంటి వాడో పట్టణ ప్రజలకు తెలుసునని ఆయన తెలిపారు.తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బులను తనకు అప్పులు ఇచ్చిన వారికి ఇవ్వాలని పట్టణ పెద్దలు, రాజకీయ పార్టీల నేతలను రామకృష్ణ కోరారు. మిగిలిన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నెల 3 వ తేదీన పాల్వంచలో రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది..రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాతి నుండి రాఘవేందర్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. రామకృష్ణ సూసైడ్ నోట్ లో తన పేరును ఎందుకు రాశాదో తెలియదని వనమా రాఘవేందర్ మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నారు.
http://www.teluguone.com/news/content/ramakrshna-selfi-video-booked-mla-son-vanama-raghavendra-39-129704.html





