ఎవరిని వదలడా.. ఎమ్మెల్యే కొడుకు ఇంత దుర్మార్గుడా! రామకృష్ణ సెల్ఫీ వీడియోలో సంచలనాలు..

Publish Date:Jan 5, 2022

Advertisement

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అనేక ట్విస్టులు బయటికి వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు అరాచకాలు వెలుగులోనికి వస్తున్నాయి.  ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు చుట్టూ ఉచ్చు బిగుస్తుండగా తాజాగా, ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న మరో వీడియో బయటకు వచ్చి ప్రకంపనలు రేపుతోంది. రామకృష్ణ ఈ వీడియోలో ఆత్మహత్యకు గల కారణాలను పూసగుచ్చినట్టు వివరించారు.

ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్ర కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమైపోయాయని రామకృష్ణ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులు రాజకీయంగా ఎదిగితే ప్రమాదమని, ఆయనను ఎదగనివ్వొద్దని కోరారు. డబ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడినని, కానీ ఆయన ఏ భర్త వినకూడని మాటను అడిగారని వాపోయారు. తన భార్యను హైదరాబాద్ తీసుకురావాలని కోరారని కన్నీళ్లు పెట్టుకున్నారు రామకృష్ణ. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని అన్నారు. నీ భార్యను నీవు ఎప్పుడు హైద్రాబాద్ కు తీసుకు వస్తావో అప్పుడు నీ సమస్య పరిష్కారం అవుతుందని తనను వనమా రాఘవేందర్ బెదిరించారన్నారు. . ఇలాంటి దుర్మార్గుడిని ఏం చేయాలని రామకృష్ణ ప్రశ్నించారు. వనమా రాఘవ వల్ల ఎన్నో  కుటుంబాలు నాశనమయ్యాయని  రామకృష్ణ గుర్తు చేశారు. ఎవరి వద్దకు వెళ్లినా కూడా ఎవరూ కూడా ఈ సమస్యను పరిష్కరించలేరని రాఘవేందర్ తనను బెదిరించినట్టుగా రామకృష్ణ  వివరించారు. ఎదుటి మనిషి యొక్క బలహీనతల్ని గ్రహించి  రాఘవేందర్ తన పబ్బం గడుపుకొంటున్నాడని రామకృష్ణ చెప్పారు.  

తన భార్యను తీసుకొని హైద్రాబాద్ కు రావాలని వనమా రాఘవేంద్ర ఆర్ఢర్ వేశాడని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేందర్ తీరుతోనే తాము ఆత్మహత్య చేసకోవాలని నిర్ణయం తీసుకొన్నామని రామకృష్ణ వివరించారు.తాను ఒక్కడిని వెళ్లిపోతే (ఆత్మహత్య చేసుకుంటే) తన భార్య, పిల్లలను ఆయన వదిలిపెట్టరని, అందుకనే తనతోపాటు వారినీ తీసుకెళ్తున్నానని సెల్ఫీ వీడియోలో రామకృష్ణ చెప్పారు. అప్పుల్లో కూరుకుపోయిన తనపై తన తల్లి, సోదరి కక్ష సాధించారని రామకృష్ణ ఆ సెల్ఫీ వీడియోలో వివరించారు. వనమా రాఘవేందర్ వల్లే ఇటీవలనే పట్టణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడని  ఆయన గుర్తు చేశారు. ఈ కేసుతో నెల రోజుల పాటు బయటకు రాకుండా ఉన్న రాఘవేందర్ ప్రస్తుతం తనను వేధిస్తున్నాడని రామకృష్ణ ఆవేదన చెందారు. నేను ఒక్కడినే చనిపోతే నా భార్య పిల్లలను వదిలి పెట్టడు, వనమా రాఘవేందర్ బారిన పడకుండా తన భార్యా పిల్లలను కూడా తీసుకెళ్తున్నానని రామకృస్ణ ఆ సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.

రాఘవేందర్ వల్ల పట్టణంలో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కొందరు బయటకు వచ్చి చెప్పుకొన్నారు, మరికొందరు బయటకు రాలేదని రామకృష్ణ వివరించారు.తాను ఎలాంటి వాడినో, వనమా రాఘవేందర్ ఎలాంటి వాడో పట్టణ ప్రజలకు తెలుసునని ఆయన తెలిపారు.తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని విక్రయించగా వచ్చిన డబ్బులను తనకు అప్పులు ఇచ్చిన వారికి ఇవ్వాలని పట్టణ పెద్దలు, రాజకీయ పార్టీల నేతలను రామకృష్ణ కోరారు. మిగిలిన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఈ నెల 3 వ తేదీన  పాల్వంచలో  రామకృష్ణ తన భార్యా పిల్లలతో ఆత్మహత్య చేసుకొన్నాడు. అదే రోజున రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి తో పాటు పెద్ద కూతురు  సాహిత్య మరణిచారు. ఈ ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్న కూతురు సాహితీ బుధవారం నాడు మరణించింది..రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన తర్వాతి నుండి రాఘవేందర్ పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. రామకృష్ణ సూసైడ్ నోట్ లో తన పేరును ఎందుకు రాశాదో తెలియదని వనమా రాఘవేందర్  మీడియాకు రిలీజ్ చేసిన వీడియోలో పేర్కొన్నారు. 

By
en-us Political News

  
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా  కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
 పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ  అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ  దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు.    ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
రేపే మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌.. ప్రశాంతంగా సాగేనా.?
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.