రేవంత్ మీద కూడా సినిమా తీస్తాడేమో..?
Publish Date:Nov 1, 2017
Advertisement
నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో క్రియేటివ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ స్పెషలిస్ట్. ముంబై అండర్‌వరల్డ్‌పై కంపెనీ తీసినా.. సీమలో రెండు కుటుంబాల ఘర్షణను రక్తచరిత్రగా తీసినా.. బెజవాడ రౌడీయిజాన్ని అందంగా మలిచినా అది రామ్‌గోపాల్ వర్మకే చెల్లింది. సమాజంలో ఏదైనా ఘటన జరిగినప్పుడో.. ఆసక్తికరమైన అంశం కనిపించినప్పుడు దానికి సంబంధించిన అదనపు సమాచారం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతాం. కానీ వర్మ స్టైలే వేరు.. ఆయన మాత్రం అందులో సినిమా తీసే విషయం ఏదన్నా ఉందా అని వెతుకుతాడు. కొన్ని సినిమాలుగా మలుస్తే.. మాటలకే పరిమితమైనవి మరికొన్ని.. వాటిలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చనిపోయినప్పుడు ఆయనను బేస్ చేసుకొని రెడ్డిగారు పోయారు అన్నాడు.. ఆ తర్వాత తెలంగాణ గ్రేహౌండ్స్ బలగాల చేతిలో హతమైన గ్యాంగ్‌స్టార్ నయిమ్‌పై సినిమా అన్నాడు.. ఆ తర్వాత స్వర్గీయ జయలలిత మీద సినిమా అన్నాడు... కాదు కాదు దానికంటే ముందు శశికళ జీవితకథ ఆధారంగా సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ వీటీలో ఏ ఒక్కటీ సెట్స్ మీదకు వెళ్లిన దాఖలాలు లేవు. వర్మలో ఉన్న మరో లక్షణం ఏంటంటే.. కాంట్రవర్సీ కోసమో.. పబ్లిసిటీ స్టంటో తెలియదు కానీ లైమ్ లైట్‌లో ఉన్న ప్రముఖులని టార్గెట్ చేసి వారు ఇంద్రుడు.. చంద్రుడు అంటూ మునగచెట్టు ఎక్కించడమో.. లేకపోతే వారిపై విమర్శలు చేయడమో చేస్తూ ఉంటాడు. తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొన్న రేవంత్ రెడ్డిపై రామూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డిని బాహుబలిగా అభివర్ణిస్తూ తనదైన స్టైల్లో ప్రశంసల వర్షం కురిపించాడు. కాంగ్రెస్ పార్టీ అనేది ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి అని.. ఆయన ఆ పార్టీలో చేరడం పట్ల తానెంతో హ్యాపీగా ఉన్నా అన్నాడు.. ‘‘రేవంత్ రెడ్డి బాహుబలి.. అంటూ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చూస్తుంటే రేవంత్ రాజకీయాల్లోకి ఎలా వచ్చింది.. ముఖ్యంగా ఆయన ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన ఓటుకు నోటు కేసు తదితర అంశాలతో సినిమా తీస్తానని ఎనౌన్స్ చేస్తాడేమో..? మరి వర్మ మనసులో ఏముందో..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ..
రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళి నమ్మకం వచ్చింది..
కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి బాహుబలి..
బాహుబలి బాక్సాఫీస్ కి నోట్ల వర్షం కురిపిస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి ఓట్ల వర్షం కురిపిస్తాడు..’’
http://www.teluguone.com/news/content/ram-gopal-varma-45-78572.html





