హద్దులు దాటుతున్న రాం గోపాల్ వర్మ వ్యాఖ్యలు
Publish Date:Dec 3, 2015
Advertisement
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన వ్రాసిన “గన్స్ అండ్ థైస్” అనే పుస్తకంలో అసాంఘీక శక్తులతో తనకున్న పరిచయాల గురించి, సినీ పరిశ్రమకు చెందినా కొందరితో తన అక్రమ సంబంధాల గురించి వ్రాసినట్లు చెప్పుకొన్నారు. తన పుస్తకాన్ని మాఫియా గ్యాంగులకి, తనతో అక్రమ సంబంధాలు పెట్టుకొన్న మహిళలకి, ఒక ప్రముఖ నీలి చిత్రాల హీరోయిన్ కి అంకితం ఇస్తున్నట్లు చెప్పుకోవడం ఆయనకే చెల్లు. ఇక ఆ పుస్తకంలో ప్రముఖ నటి శ్రీదేవి గురించి కూడా చాలా అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అదే విషయాన్ని ఆయన నిన్న తన ట్వీటర్ మేసేజులో కూడా దృవీకరించడం విశేషం. ఒక పరాయి వ్యక్తి భార్య గురించి అతను ఈవిధంగా అనగలడని సమాజంలో ఎవరూ ఊహించలేరు. ఆయన తాజా మెసేజ్ లలో నటి శ్రీదేవి గురించి ఏమి అన్నారంటే “ శ్రీదేవి వీరాభిమాని అయిన నేను ఆమె భర్త బోనీ కపూర్ కంటే ఆమెను ఎక్కువగా గౌరవిస్తున్నాను. ఆ సంగతి శ్రీదేవికి కూడా తెలుసు. బోణీ కపూర్ నా ఈ వ్యాఖ్యలు చూసి నామీద వెంటనే విరుచుకుపడిపోకుండా శ్రీదేవి తొడల (తండరింగ్ థైస్) గురించి నేను నా “గన్స్ అండ్ థైస్” అనే పుస్తకంలో వ్రాసినదంతా చదవాలని కోరుతున్నాను. శ్రీదేవికి సినీ పరిశ్రమలో ఇంత ఎత్తుకు ఎదగ గలిగారంటే కేవలం ఆమె అద్భుతమయిన నటన మాత్రమె కారణం కాదు. ఆమె అద్భుతమయిన తొడలు కూడా అందుకు కారణమని నమ్ముతున్నాను. ఆమె హిందీలో ‘హిమ్మత్ వాలా’ సినిమాలో నటించినపుడే ఈ విషయం స్పష్టమయింది. ఒకవేళ కేవలం ఆమె ప్రతిభ వలననే ఆమె ఇంత ఎత్తుకు ఎదగ గలిగారనుకొంటే, స్మితా పాటిల్ కూడా ఆమె లాగే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి ఉండాలి. కానీ అలా జరుగలేదు. అందుకు కారణం శ్రీదేవి తొడలే! ఆమె తొడలే ఆమెను స్మితా పాటిల్ కంటే గొప్ప హీరోయిన్ న్ని చేశాయని నేను భావిస్తున్నాను. నేను శ్రీదేవిగారి తొడలను, ఆమె చిరునవ్వును, ఆమె నటనా ప్రతిభని, ఆమె సున్నితత్వాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చాలా గౌరవిస్తున్నాను.అన్నిటి కంటే ఎక్కువగా ఆమె తన భర్త బోణీ కపూర్ పట్ల చూపుతున్న ప్రేమను ఇంకా గౌరవిస్తున్నాను.” అని వ్రాసారు.
http://www.teluguone.com/news/content/ram-gopal-varma-32-53064.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
ఈవారం అంటే.... నవంబర్ 29, 2015 నుంచి డిసెంబర్ 5, 2015 వరకు మీ గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.