రామ్ చరణ్ ‘జంజీర్’ కబుర్లు
Publish Date:Feb 26, 2013
Advertisement
తన ‘నాయక్’ సినిమాతో మంచి ఊపుమీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తెలుగులో ‘ఎవడు’ అనే ఒక సినిమా, హిందీలో ‘జంజీర్’ అనే మరో సినిమా షూటింగులతో చాలా బిజీగా ఉన్నాడు. అతని ‘ఎవడు’ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా శ్రుతీ హాస్సన్ మరియు అమీ జాక్సన్ నాయికలుగా రామ్ చరణ్ తో జత కడుతున్నారు. ఈ సినిమాలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ తేజ్ హిందీ సినిమాను అపూర్వ లఖియా అనే సుప్రసిద్ధ బాలివుడ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలివుడ్ నెంబర్:1 హీరోయిన్ ప్రియాంకా చోప్రా రామ్ చరణ్ తో జత కట్టడం మరో ప్రత్యేకాకర్షణగా నిలువబోతోంది. గతంలో అమితాబ్ బచ్చన్ చేసిన ఇనస్పెక్టర్ విజయ్ పాత్రను ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ చేస్తున్నాడు. రామ్ చరణ్ తేజ్, నిజ జీవితంలో చాలా మృధుస్వభావి, మిత బాషి, స్నేహపూరితంగా ఉంటాడు. కానీ, ఈ సినిమాలో రామ్ చరణ్ తన మనస్తత్వానికి పూర్తి విభిన్నమయిన పాత్రను చేస్తున్నాడు. అతను ఒక కోపిష్టిగా ఎల్లపుడూ ముభావంగా ఉండే పోలీసు ఆఫీసరుగా ఈ సినిమాలో కనిపిస్తాడు. ఇదే విషయం గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ, నిజానికి తనకు ప్రధమకోపం ఎక్కువే కానీ, అది నిమిషంలో చల్లారిపోతుందని అన్నాడు. తన సినిమా జీవితంలో మొట్టమొదటిసారిగా పోలీసు యూనిఫారం వేసుకొని నటిస్తున్నందుకు తను చాలా ఆనందపడుతున్నానని అన్నాడు. బాధ్యతగల పోలీసు యూనిఫారం వేసుకొన్నందున షూటింగు సమయంలో బుద్ధిగా కూర్చోంటూన్నానని చెప్పాడు. ప్రస్తుతం హీరోయిన్ ప్రియాంక చోప్రా నుండి తానూ హిందీ మాట్లాడటం నేర్చుకొంటూ, ఆమెకు తెలుగు నేర్పిస్తున్నానని చెప్పాడు. హిందీ రాకపోయినా అర్ధం చేసుకోగలను కనుక, డైలాగుకి తగిన హావాభావాలు ప్రదర్శించడంలో ఇబ్బంది లేదని అన్నాడు. గతంలో నిర్మించిన ‘జంజీర్’ సినిమాలో సుప్రసిద్ధ హిందీ నటుడు ప్రాణ్ పోషించిన ‘షేర్ ఖాన్’ (అమితాబ్ స్నేహితుడి పాత్ర)ను ఈ సినిమాలో బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ చేస్తున్నాడు. మొదట ఆ పాత్రను చేయడానికి అయన ఇష్టపడకపోవడంతో, అర్జున్ రాం పాల్ ను ఆ పాత్రకు అనుకొన్నారు. కానీ, సంజయ్ దత్త్ మనసు మార్చుకొని మళ్ళీ రావడంతో షేర్ ఖాన్ పాత్రను తిరిగి ఆయనకే అప్పగించారు. ఇక, ఈ సినిమా తెలుగు వెర్షన్ కు ‘రుస్తుం’గా పేరు నిర్ణయించారు. తెలుగు, హిందీ బాషలలో ఒకేసారి ఈ ఏడాది మే నెల 10వ తేదీన విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, 27 సం.ల క్రితం ఆ సినిమాకు కధను అందించిన ప్రముఖ బాలివుడ్ సినీ కధా రచయిత జావేద్ అక్తర్ సినిమా నిర్మాణం మొదలుపెట్టిన కొద్ది రోజులకే, ఆ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసారు. తమ కధను ఆధారంగా చేసుకొని ‘జంజీర్’ సినిమాను పునర్నిర్మిస్తునందున తనకు రూ.6 కోట్లు రాయల్టీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా నిర్మాతలు వారితో ఈ విషయమై సంప్రదింపులు జరుపుతున్నారని రామ్ చరణ్ అన్నాడు. ఒకానొకసమయంలో అమితాబ్ బచ్చన్‌ను సినిమాలలో నటించడానికి పనికిరావని అందరూ తిరస్కరించినప్పుడు, ఆయన మూట ముల్లే సర్దుకొని అలహాబాద్ తిరిగి వెళ్లిపోదామనుకొంటున్న తరుణంలో ఆయనకు ‘జంజీర్’ ఆఫర్ రావడంతో ఆయన దశ తిరిగి, నేటికీ బాలివుడ్ లో తిరుగులేని హీరోగా నిలబెట్టింది. బాలివుడ్ లో ఆయనకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలికించేలా చేసిన ఆ సినిమానే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ చేస్తునందున ఇప్పుడు రామ్ చరణ్ కు కూడా బాలివుడ్ ద్వారాలు తెరిచి కొత్త అవకాశాలు తెస్తుందని ఆశించవచ్చును.
http://www.teluguone.com/news/content/ram-charan-tej-32-21217.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.