పరిహారం ప్రకటించినా ప్రతాపమే.. కేసీఆర్ కు రైతు నేత షాక్..

Publish Date:Nov 25, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా రైతుల గురించే మాట్లాడుతున్నారు. రైతుల కోసం ఏమైనా చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారు. తెలంగాణలో పండిన వరి ధాన్యం మొత్తం కేంద్రమే కొనాలంటూ ఏకంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ధర్నా చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా మోడీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు ఉద్యమాన్ని ప్రశంసించారు. ఏడాదికి పైగా  సాగుతున్న రైతు ఉద్యమంలో చనిపోయినవాళ్లకు సంతాపం తెలిపారు. తెలంగాణ సర్కార్ తరపున మూడు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అమరులైన రైతు కుటంబాలకు కేంద్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.

రైతుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు చనిపోయిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటించడంతో.. రైతుల నుంచి తమకు మద్దతు లభిస్తుందని గులాబీ లీడర్లు భావించారు. రైతు ఉద్యమ నేతలు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను అభినందిస్తారని ఊహించారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులు వరి ధాన్యం కొనాలంటూ రోడ్డెక్కుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమయంలో జాతీయ రైతు సంఘం నేతలు కేసీఆర్ ను కలిస్తే తమకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ నేతలు ఆశ పడ్డారు. కాని వాళ్ల ఆశలన్ని అడియాశలయ్యాయి.

ఏడాదిగా రైతు ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిస్తున్న భారత్ కిసాన్ యూనియన్ కీలక నేత రాకేష్ తికాయత్.. గులాబీ లీడర్లు ఆశించినట్లే హైదరాబాద్ వచ్చారు. కాని కేసీఆర్ ను కలవలేదు. కలవకపోవడమే కాదు.. కేసీఆర్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు.  ఢిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద విపక్ష పార్టీలు నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న తికాయత్.. సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. బీజేపీకి టీఆర్ఎస్ బీ పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే టీఆర్ఎస్‌ను ఢిల్లీకి పంపొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తికాయత్ డిమాండ్ చేశారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటల‌కు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

హైదరాబాద్ వచ్చిన రైతు సంఘం నేత రాకేష్ తికాయత్.. కేసీఆర్ ను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కిషాన్ సంఘ్ నేత కేసీఆర్ ను కలిసి అభినందిస్తారని భావిస్తే.. ఇలా అటాక్ చేయడమేంటనే చర్చ టీఆర్ఎస్ లో సాగుతోంది. ఏదో అనుకుంటే ఏదో అయిందని, రైతు కుటుంబాలకు పరిహారం ప్రకటించినా... కిషాన్ సంఘ్ నేతలు పట్టించుకోకపోవడం ఏంటని గులాబీ లీడర్లు మథనపడుతున్నారు. రాకేష్ తికాయత్ కామెంట్లపై ప్రగతి భవన్ లో హాట్ హాట్ చర్చ సాగుతుందని తెలుస్తోంది. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.