నా వెనుక బీజేపీ లేదు...
Publish Date:Mar 20, 2018
Advertisement
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజులుగా హిమాలయాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన పర్యటన ముగిసింది. హిమాలయాల పర్యటన ముగించుకుని ఈరోజు చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిమాలయాల యాత్ర చాలా ప్రశాంతంగా జరిగిందని, తనకు కొత్త శక్తి నిచ్చిందని అన్నారు. అంతేకాదు రజనీ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ వెనుక బీజేపీ ఉందన్న వార్తలను ఆయన ఖండించారు. నా వెనుక బీజేపీ ఉందని కొందరు ఆరోపిస్తున్నారు.. ఆ వ్యాఖ్యలు తప్పని, తన వెనుక ఉన్నది ‘దేవుడు’ అని రజనీ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి మీడియా ఎన్ని ప్రశ్నలు వేసినా తాను చెప్పే సమాధానమిదేనని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajinikanth-39-80716.html
http://www.teluguone.com/news/content/rajinikanth-39-80716.html
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 27, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 25, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 24, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 23, 2026
Publish Date:Nov 22, 2026
Publish Date:Nov 21, 2026





