బీఆర్ఎస్ గూటికి రాజాసింగ్?

Publish Date:Jul 24, 2023

Advertisement

జంటనగరాల్లో బీజేపీకి కంచుకోటలాంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది గోషా మహల్ మాత్రమే. అయితే వచ్చే ఎన్నికలలో ఆ నియోజకవర్గంలో బీజేపీ విజయంపై నీలి మేఘాలు అలుముకున్నాయి. గోషామహల్ నుంచి బీజేపీ వరుస విజయాలకు కారణం ఆ నియోజకవర్గంపై ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఉన్న పట్టుమాత్రమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయనను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నాటి నుంచి గోషామహల్ లో బీజేపీ పరిస్థితి ఏమిటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంది.  

రాజాసింగ్ సస్పెన్షన్ పై బీజేపీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకోకపోవడం, ఈటల వంటి వారు ఆయనను కలిస్తే కూడా పార్టీ హైకమాండ్ సహించే పరిస్థితి లేకపోవడంతో రాజాసింగ్ బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఆయన ఇండిపెండెంట్ గా నిలబడతారా? లేక మరో పార్టీ గూటికి చేరుతారా అన్న విషయంలో ఇప్పటికింకా క్లారిటీ లేదు. కానీ ఆయన సన్నిహితులు మాత్రం రాజాసింగ్ పార్టీ మారడం ఖాయమనీ, బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు లేకపోలేదనీ అంటున్నారు.  ముఖ్యంగా గోషామహల్ నియోజకవర్గంలో విజయం కోసం కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు.    

ఇటీవల మంత్రి హరీశ్‌రావుతో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ  అయ్యారు. ఆదివారం ఘోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రెండు భేటీల నేపథ్యంలో ఘోషామహల్ లో బీఆర్ఎస్ పాగాకు కేసీఆర్ పక్కా వ్యూహాన్ని రచించారన్న చర్చ గులాబి శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.  ఈ రెండు భేటీల నేపథ్యంలో బీజేపీ కూడా రాజాసింగ్ పార్టీ మారడం ఖాయమన్న భావనకు వచ్చేసి అక్కడ ప్రత్యామ్నాయ నాయకుడి కోసం అన్వేషణ ప్రారంభించిందంటున్నారు. హరీష్ రావుతో రాజాసింగ్ భేటీ తరువాతనే బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల కూడా రాజాసింగ్ తో భేటీ అయ్యారు. పార్టీ మారవద్దు సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని చెప్పడానికే ఈటల ఆయనను కలిశారని అంటున్నారు.

అయితే  రాజాసింగ్ తో భేటీ కావడంపై బీజేపీ అధిష్ఠానం ఈటలను మందలించారు. దీంతో రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటును ఎత్తివేసే ఉద్దేశమేదీ బీజేపీ హైకమాండ్ లో లేదని స్పష్టమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ఘోషా మహల్ నుంచి ముచ్చటగా మూడో సారి అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సాధించాలన్నది రాజాసింగ్ లక్ష్యంగా చెబుతున్నారు. పైకి పార్టీ మారేది లేదని ఆయన చెబుతున్నా.. అంతర్గతంగా బీఆర్ఎస్ లేదా మరో పార్టీ గూటికి చేరేందుకు రాజాసింగ్  తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారని పరిశీలకులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.