Publish Date:Mar 13, 2025
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే రాజాసింగ్ తాజాగా సొంత పార్టీలోని సీనియర్లు కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యారనేలా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఒక్క కాంగ్రెస్ అనేమిటి ఈ సీనియర్లు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతారని దుయ్యబట్టారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే సీనియర్లను పార్టీ నుంచి బయటకు పంపేయాలన్నారు. పార్టీలోని కొందరు సీనియర్ నాయకుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన రాసిన ఓ బహిరంగ లేఖలో బీజేపీ సీనియర్లను పాత సామానుతో పోల్చారు.
పార్టీ ప్రయోజనాలను ఫణంగా పెట్టి పబ్బంగడుపుకుంటున్నారని రాజాసింగ్ అంటున్నారు. పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డితో రహస్య భేటీలు జరుపుతున్నారని ఆరోపించారు. ఇటువంటి నేతలతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మృగ్యమన్న రాజాసింగ్ అటువంటివారిని పార్టీ నుంచి సాగనంపాలన్నారు. ఇది తన ఒక్కడి అభిమతం కాదనీ, కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారనీ చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణలో హిందువులకు రక్షణ ఏర్పడుతుందన్నారు. రేవంత్ ప్రభుత్వ పాలనను ఆయన నిజాం పాలనతో పోల్చారు. అలాంటి రేవంత్ రెడ్డితో రహస్య భేటీలు నిర్వహించే నేతలను పెట్టుకుని బీజపీ రాష్ట్రంలో అధికారంలోకి ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఇటువంటి వారికి వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తేనే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్ బాగుంటుందని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajasingh-sensational-comments-ob-bjp-leaders-25-194344.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.