అల్లు అర్జున్ ఈజ్ రియల్ లైఫ్ హీరో: రాజమౌళి
Publish Date:Oct 10, 2015
Advertisement
బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని అమాంతం హాలీవుడ్ స్థాయికి చేర్చిన దర్శకుడు రాజమౌళి రుద్రమదేవి సినిమాపై తన ట్వీటర్ ద్వారా ప్రశంశల వర్షం కురిపించారు. ముఖ్యంగా అందులో ముఖ్యపాత్రలు చేసిన అల్లు అర్జున్, రానా, అనుష్క, ప్రకాష్ రాజ్ లను చాలా మెచ్చుకొన్నారు. గోన గన్నారెడ్డి పాత్ర పోషించిన అల్లు అర్జున్ గురించి ఈవిధంగా అన్నారు. “రుద్రమదేవి సినిమా షూటింగ్ దాదాపు నిలిచిపోయినప్పుడు అల్లు అర్జున్ ప్రవేశించి దానిని ముందుకు తీసుకుపోవడమే కాకుండా గన్నా రెడ్డి పాత్రను చాలా అద్భుతంగా పోషించారు. ఆయన నటన సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చును. మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా దానికి తెలంగాణా ప్రభుత్వం చేత వినోదపన్ను మినహాయింపు ఇప్పించడంలో సహాయపడినట్లు విన్నాను. అల్లు అర్జున్ సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా హీరో అనిపించుకొన్నాడు. అతనికి నా మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. రుద్రమదేవి పాత్రలో స్వీటీ (అనుష్క) అత్యద్భుతంగా నటించింది. ఆ పాత్రలో ఆమె కనబరిచిన నిబద్దత అత్యద్భుతం. రుద్రమదేవి పాత్రని ఆమె తప్ప మరొకరు చేయలేరనే అంత గొప్పగా నటించింది. అటువంటి గొప్ప నటిని కలిగి ఉండటం మన సినీ పరిశ్రమ అదృష్టం. రుద్రమదేవి, వీరభద్రుల పాత్రలు మరికొంత కొనసాగించి ఉండి ఉంటే చాలా తృప్తిగా ఉండేది. కానీ ఆ కొద్దిపాటి సమయంలోనే రానా తన ప్రతిభను చాటుకొన్నారు. ఇకపై ఎవరయినా ఇటువంటి చారిత్రిక సినిమాలను తీయదలిస్తే రానాయే మొదట గుర్తుకు వస్తాడు. అంత గొప్పగా చేసాడు రుద్రమదేవిలో తన పాత్రని. శివదేవయ్య రాజకీయ ఎత్తుగడలను కూడా మరికొంత చూపించి ఉండి ఉంటే బాగుండేది. ప్రకాష్ రాజ్ గారు తనకు ఇచ్చిన సమయంలో ఆ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇటువంటి గొప్ప సినిమాను తీయలనుకొన్నందుకు, తీసినందుకు, తీసి విజయం సాధించినందుకు దర్శకుడు గుణశేఖర్ గారికి, వారి యూనిట్ మెంబర్లు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు,” అని రాజమౌళి ట్వీట్ చేసారు.
http://www.teluguone.com/news/content/rajamouli-32-51076.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.