బీజేపీ తెలంగాణ నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్.!

Publish Date:Aug 19, 2026

Advertisement

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నాయకులెవరికీ చోటు దక్కకపోవడం ఇప్పుడు రాష్ట్ర పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవల ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలో తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రేంజ్ లో కామెంట్లు చేశారు.  

రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 

తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు నిరంతరం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న ఆయన కొందరైతే తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కు రాజకీయాలు కూడా నెరపుతున్నారని ఆరోపించారు.  ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి పరుగెత్తుకెళ్లి, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.ఈ  వర్గపోరు సంస్కృతి వల్లే "తెలంగాణ నేతలు ఇక మారన్న అభిప్రాయానికి వచ్చిన బీజేపీ అధిష్ఠానం ఎవరినీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని రాజాసింగ్ అన్నారు.   

దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్న ఆయన..    క్రమశిక్షణ లేని నాయకత్వం, నిరంతర గ్రూపు తగదాల వల్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవహిస్తుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించడం అసాధ్యమని హెచ్చరించారు.  

Raja Singh,  telangana bjp leaders, Telangana BJP, BJP National Executive, Goshamahal MLA, BJP Internal Politics

By
en-us Political News

  
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.