Publish Date:Aug 19, 2026
బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు చెందిన నాయకులెవరికీ చోటు దక్కకపోవడం ఇప్పుడు రాష్ట్ర పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీలో తెలంగాణకు చెందిన సీనియర్ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రేంజ్ లో కామెంట్లు చేశారు.
రాష్ట్ర బీజేపీలో అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి కారణమన్నారు. గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు నిరంతరం స్వార్థ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్న ఆయన కొందరైతే తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నాయకులతో కుమ్మక్కు రాజకీయాలు కూడా నెరపుతున్నారని ఆరోపించారు. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీకి పరుగెత్తుకెళ్లి, ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.ఈ వర్గపోరు సంస్కృతి వల్లే "తెలంగాణ నేతలు ఇక మారన్న అభిప్రాయానికి వచ్చిన బీజేపీ అధిష్ఠానం ఎవరినీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని రాజాసింగ్ అన్నారు.
దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలన్న ఆయన.. క్రమశిక్షణ లేని నాయకత్వం, నిరంతర గ్రూపు తగదాల వల్ల పార్టీ శ్రేణుల్లో నిరాశ ఆవహిస్తుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో కూడా విజయం సాధించడం అసాధ్యమని హెచ్చరించారు.
Raja Singh, telangana bjp leaders, Telangana BJP, BJP National Executive, Goshamahal MLA, BJP Internal Politics
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/raja-singh-fire-on-telangana-bjp-leaders-39-229273.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.