మూడు రోజులు ఈదురుగాలులతో వానలు.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
Publish Date:Apr 16, 2025
Advertisement
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నాది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. అయితే ఈ వర్షం ఆగగానే.. మళ్లీ భనుడు భగ భమన్నాడు. నేడు సైతం హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి ఎండలు మండిపోయాయి. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. సాయంత్రం వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.
http://www.teluguone.com/news/content/rains-with-three-gales-in-telangana-yellow-alert-for-several-districts-heavy-rains-39-196345.html





