Publish Date:Mar 31, 2025
వేసవి వేడి నుంచి తెలంగాణ వాసులకు ఉపశమనం కలగనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మార్చి లోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న తెలంగాణ వాసులకు రాష్ట్రంలో మూడు రోజులు వాతావరణం చల్లబడనుందన్న చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంగళవారం (ఏప్రిల్ 1) నుంచి గురువారం (ఏప్రిల్ 3) వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం పేర్కొంది.
ఈ వర్షాల కారణంగా వాతావరణం చల్లబడు తుందనీ, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదౌతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2, 3 తేదీల్లో వానల కారణంగా వాతావరణం చల్లబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కుమురం భీమ్, వనపర్తి, నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rains-in-telangana-25-195317.html
వైసీపీలో సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు అందరూ సైలెంట్ అయిపోగా.. మాజీ మంత్రి, సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. ప్రస్తుతం వైసీపీలో గట్టిగా మాట్లాడుతున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది అంబటి మాత్రమే. అటువంటి అంబటి రాంబాబు బుధవారం(ఏప్రిల్ 2) కొత్త అవతారంలో కనిపించారు.
వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిపై గతేడాది సెప్టెంబర్ 23న సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కుంభ కోణంలో వైకాపా ఎంపి మిథున్ రెడ్డి పాత్రను కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో మిథున్ రెడ్డి హైకోర్టు నాశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు గత నెల 24న ముగియడంతో తీర్పును ఏప్రిల్ మూడుకు రిజర్వ్ చేసింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ గురువారం తీర్పు చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నాయకుడు నాగేంద్ర బాబు ఎంట్రీ ఎప్పుడన్న చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. కొణిదెల నాగబాబు బుధవారం (ఏప్రిల్ 2) ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
కర్నాటక రాష్ట్రంలో బైక్ ట్యాక్సీలను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ ఆపరేటర్లు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని కర్నాటక హైకోర్టు తీర్పు వెలువరించింది.
త కొన్ని రోజులుగా భానుడి భగభుగలతో, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరవాసులకు వరుణుడు ఒకింత ఉపశమనాన్ని ఇచ్చాడు. గురువారం మధ్యాహ్నం వరకూ చండ్ర నిప్పులు చెరుగుతున్నట్లుగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం తరువాత హఠాత్తుగా చల్లబడింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ను స్వతంత్ర సం్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటి వరకూ ఏపీ ఫైబర్ నెట్ లో భాగంగా ఉన్న డ్రోన్ కార్పొరేషన్ ను ఇక నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ గా స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
నటుడు పోసాని కృష్ణ మురళి షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. పోసానికి బెయిల్ ఇచ్చేముందు కోర్టు ప్రతీ సోమవారం, గురువారం మంగళగిరి సిఐడి కార్యాలయానికి రావాలి. రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని బెయిల్ పై విడుదలైన తర్వాత మంగళగిరి సిఐడి కార్యాలయానికి చేరుకున్నారు.
మాట తప్పను.. మడమ తిప్పను అని పదేపదే చెప్పుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆచరణ మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఇచ్చిన ఏ మాటనూ, చేసిన ఏ వాగ్దానాన్నీ పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇచ్చిన మాటకు కట్టబడటం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదనిపించేలా జగన్ ఐదేళ్ల పాలన సాగింది. విపక్షంలో ఉండగా అమరావతి రాజధానికి జై అన్న జగన్ అధికార పగ్గాలు అందుకోగానే మూడు రాజధానులంటూ మూడుముక్కలాటకు తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. అమ్మ ఒడి, పింఛన్లు ఇలా ఒకటనేమిటి.. తన పాదయాత్ర సందర్భంగా గల్లీ కో వాగ్దానం చొప్పున చేసిన జగన్ వాటిని నెరవేర్చాలన్న విషయాన్నే పూర్తిగా మరిచారు. అధికారం అంటే కక్ష సాధింపు, దోచుకో, దాచుకో అన్నట్లుగా ఆయన పాలన సాగింది.
తెలంగాణలో బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు
ఏపీలో ఎన్నికలకు ముందు మీసాలు మెలేసి, తొడలు కొట్టిన మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఫలితాల తర్వాత పత్తా లేకుండా పోయారు. చంద్రబాబుతో పాటు పవన్‌పై విరుచుకుపడిన ఆ ఫైర్‌బ్రాండ్ నేత సడన్‌గా సైలెంట్ అయ్యారు. ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోవడం నెల్లూరులో హాట్ టాపిక్‌గా మారింది. పదేళ్లు ఎమ్మెల్యేగా, దాదాపు మూడేళ్లు మంత్రిగా పనిచేసిన ఆ సారు ఇప్పుడు ఇంతకాలం తనకు అండగా ఉన్న అనుచరులకు కూడా అందుబాటులో లేరంట.
మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ ఖరారయ్యే వరకూ ఆ పరిసరాలలో నిర్మాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు మూసీ నదికి 50 మీటర్ల బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై బీఏసీలో ఎనిమిది గంటల చర్చకు అంగీకారం కుదిరినప్పటికీ, అధికార, విపక్ష కూటముల మధ్య తీవ్ర వాగ్వివాదాలలో చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 12 గంటలకు పైగా చర్చ జరిగింది.
ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల ధాయ్ ల్యాండ్ పర్యటన కోసం గురువారం (ఏప్రిల్ 3) బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ థాయ్ ప్రధాని షఓటోంగ్ టార్స్ షినవ వ్రతాలతో భేటీ అవుతారు.