అవి విష వృక్షాలు.. ప్రాణాలకు ముప్పు!

Publish Date:Mar 31, 2025

Advertisement

వరసగా పదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో హరిత హారం కార్యక్రమం ఒకటి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఎంత  ప్రాధాన్యత ఇచ్చిందో, హరిత హారం ప్రాజెక్టుకు  కూడా అంతే  ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో పచ్చదనాన్నిపెంచాలనే లక్ష్యంతో 2015 లో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు స్వహస్తాలతో  చిలుకూరు బాలాజీ సన్నిధిలో ప్రారంభించిన హరిత హరం పథకాన్ని  బీఆర్ఎస్ ప్రభుత్వం చివరి వరకూ కొనసాగించింది.  ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా టార్గెట్స్  ఫిక్స్  చేసుకుని మరీ కోట్లలో మొక్కలు నాటారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయ్యింది. 

అవును  అధికారిక లెక్కల ప్రకారమే  2023 జూన్ నాటికి తెలంగాణ హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం రూ. 10,822 కోట్లు ఖర్చు చేసింది. మొత్తం 273.33 కోట్ల మొక్కలు నాటింది. అయితే  ముఖ్యమంత్రి మానస పుత్రికగా  ప్రచారం చేసుకున్న  హరిత హారం ప్రాజక్ట్  ఆశించిన లక్ష్యం నెరవేరిందా? అంటే అనుమానమే అన్న సమాధానమే వస్తున్నది.   అయితే  ప్రభుత్వ లెక్కల ప్రకారం పదేళ్ళ కాలంలో  13,657 ఎకరాల విస్తీర్ణంలో 19,472 పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు జరిగింది. 6,298 ఎకరాల విస్తీర్ణంలో 2,011 బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. 1,00,691 కిలో మీటర్ల మేర రాష్ట్రం అంతటా రహదారి వనాలు విస్తరించాయి.  ఈ లెక్కలు చక్కగా ఉన్నాయి. అందుకే, అప్పుడే కాదు.. ఇప్పటికీ బీఆర్ఎస్  తెలంగాణ హరిత హారాన్ని తమ పదేళ్ళ పాలన సాధించిన విజయ హారం గా పేర్కొంటున్నారు.

రెండు మూడు రోజుల క్రితం ముగిసిన తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనూ, మాజీ మంత్రి  బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తమ ప్రభుత్వ హయాంలో 200 కోట్ల మొక్కలు నాటామని దీనివల్ల రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 7 శాతం పెరిగిందని చెప్పారు. అయితే ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది  అన్నట్లుగా  ప్రశాంత రెడ్డి ప్రసంగం పూర్తి కాకముందే   స్పీకర్ గడ్డం ప్రసాద్ హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల్లో ప్రజలకు పక్షులు, ఇతర జీవరాసులకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని వాటిని తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ చెట్లు  వృక్ష ధర్మానికి విరుద్ధంగా, ఆక్సిజన్  గ్రహించి, కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తాయని, వాతావరణాన్ని విష పూరితం చేస్తున్నాయని స్పీకర్ వివరించారు. ఈ కారణంగా  పక్షులు, ఇతర జీవుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని  వివరించారు. 

అదలా ఉంటే,  తాజాగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, హరిత విధ్వంసంలో కాంగ్రెస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోటీ పడుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కోసం భారాస 25 లక్షల చెట్లను నరికి వేయడంతో పాటుగా, హరితహారం ముసుగులో కోనోకార్పస్‌ను విష వృక్షాలను కానుకగా ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలో ‘కంచ గచ్చిబౌలిలో ఏకంగా 400 ఎకరాల భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేసి  పర్యావరణానికి పాతర వేస్తోందని అరోపించారు. ప్రభుత్వం వేలం వేయాలనుకుంటున్న భూమిని ఆనుకుని చాలా వృక్ష జాతులు, పక్షిజాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్యభరితమైన జీవజాతులు ఉన్నాయని బండి సంజయ్  చెబుతున్నారు. 
సంజయ్ ఆరోపణల విషయం ఎలా ఉన్నా..  స్పీకర్ సూచనను   ప్రభుతం సీరియస్  తీసుకుని కోనోకార్పస్‌  విష వృక్షాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ శాస్త్ర వేత్తలు, ప్రకృతి ప్రేమికులు కోరుకుంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఉప ఎన్నికలు రావంటూ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు సుప్రీంలో విచారణలో ఉండగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు అంటూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చాలా రోజుల తరువాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నోరు విప్పారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై తనదైన స్టైల్లో విమర్శల వర్షం కురిపించారు.
తెలుగు రాష్ట్రాలలో ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో ఐదు, తెలంగాణలో ఐదు స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
 తెలంగాణ లో సంచలనమైన  నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండ  రేప్ ఘటనలో  కొత్త కోణం వెలుగు చూసింది. మొక్కులు తీర్చుకునేందుకు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన  వారు భార్యభర్తలు  కాదని పోలీసుల దర్యాప్తులోవెల్లడైంది. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న జంట భార్యా భర్తలు కాదని  తెలుసుకున్న నిందితులు యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు.   నిందితుల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్లు, ప్రేమికులను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడేవారని వెల్లడైంది.
ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఏపీ మాజీ మంత్రి కొడాల నానికి బైపాస్ సర్జరీ జరుగుతోంది. ఈ శస్త్ర చికిత్స పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
 బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో బుధవారం( 02 ఏప్రిల్) విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్రతీరంలో గడిపేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు అలల తాకిడికి కొట్టుకుపోయారు
బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు చేపట్టిన నిరసనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు పలు పార్టీల నేతలు కూడా బీసీలకు రజర్వేషన్లకు మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నేత‌లు అధికార మ‌దంతో వ్య‌వ‌హ‌రించారు. వైఎస్ జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డంతోపాటు.. సామాన్య ప్ర‌జ‌ల‌నుసైతం నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టారు.
వరుస ఎన్ కౌంటర్లతో దెబ్బ మీద దెబ్బ తింటున్న నక్సల్స్ ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి పేరిట కేంద్రానికి ఓ బహిరంగ లేఖ రాశారు.
 తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన 400 ఎకరాల భూ వివాదంపై సినీ నటి, ఎపి డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్  మాజీ భార్య రేణుదేశాయ్ తన ఇన్ స్టా గ్రాం వేదికగా  స్పందించారు. .
నెట్‌వర్కింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, టెలికమ్యూనికేషన్ పరికరాలు, హై-టెక్నాలజీ సేవలను అభివృద్ధిలో దిగ్గజ సంస్థ అయిన సిస్కో ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నుంచి ఇప్పాల రవిచంద్రారెడ్డిని పక్కన పెట్టేసింది. పక్కన పెట్టేయడం కాదు.. పక్కన పడేసింది అనడం సబబు.
 పల్నాడు జిల్లా నరసారావుపేటలో బర్డ్ ప్లూ కలకలం రేపింది.  మంగళగిరి ఎయి మ్స్ ఆస్పత్రిలో    గత నెల 16 వ తేదీన రెండేళ్ల చనిపోవడంతో కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వైద్యుల బృందం  కుటుంబ సభ్యులకు రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.