తెలుగు రాష్ట్రాలలకు వాతావరణ శాఖ రైన్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే వారం రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా ఉండటంతో ఏపీ, తెలంగాణల్లో శుక్రవారం( జూన్ 3) నుంచి ఈ నెల 9 వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
భారీ వర్షాలకు తోడు 50 కిలోమీటర్లకంటే ఎక్కువ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాల తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. శుక్ర, శని (జులై 3, 4) వారాలలో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అలాగే శనివారం (జులై 4 ) ఆదివారం (జులై 5) భారీ వర్షాలతో పాటు గంటకుబలమైన ఈదురుగాలులు వీస్తాయనీ హెచ్చరించింది.
ఇక ఆదివారం (జులై 5) నుండి జులై 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు ఓ రేంజ్ లో దంచి కొడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rain-alert-for-the-telugu-states-36-224908.html
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
హైదరాబాద్ మహానగరంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ గచ్చిబౌలి ఐఐఐటీ క్యాంపస్‌లో శనివారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
డిజిటల్ విప్లవంలో దూసుకుపోతున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.