దేశంలో విపక్షాలన్నీ బీజేపీని గద్దె దింపాలన్న సంకల్పంతో ఉన్నాయి. బీజేపీయేతర పార్టీల పాలన లో ఉన్న రాష్ట్రాల్లో పాలన అస్తవ్యస్థం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందనీ, బీజేపీయేతర రాష్ట్రాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో పరిస్థితులను దుర్భరం చేస్తోందని, అక్కడి అధికారంలోని పార్టీల్లో విభేదాలు సృష్టించి అధికారం చేజిక్కించుకోవాలన్న తపన తప్ప అసలు ప్రజాసమస్యల్నే పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
అందుకు ఉదాహరణగా మహారాష్ట్ర పరిణామాలను చూపుతున్నాయి. అలాగే మనీ లాం డరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని ఈడీ విచారణ వెనుక కూడా బీజేపీ నాయకుల ప్రేరణ ఉందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతూన్న కాంగ్రెస్ అధినేత్రిని విచారణ పేరిట ఈడీ కార్యాలయానికి పిలిపించుకుని రోజుల తరబడి ప్రశ్నించడం దారుణమని దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిమీదకు రావాల్సిన అవసరాన్ని విపక్షాలు గుర్తించాయి. సోనియా గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనల్లో బీజేపీయేతర పక్షాలన్నీ కలిసి రావడం ఇందులో బాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలను పార్టీ బలోపేతం లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుదీర్ఘ పాద యాత్రకు నిర్ణయించుకున్నారు. ఆయన అక్టోబర్ 2వ తేదీన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ భారత్ జోడో పేరుతో పాదయాత్రం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణాలోనూ దాదాపు 350 కిలోమీటర్ల పాద యాత్రకు టీపీసీసీ ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 17 రోజుల పాటు రాష్ట్రంలో ఈ పాదయాత్రం కొనసాగుతుంది.
డిసెం బర్ లో కర్ణాటక నుంచి రాహుల్ యాత్ర జరగనుంది. 15 నియోజక వర్గాలు కవర్ అయ్యేలా యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోనున్నదని తెలుస్తోంది. ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. పదేపదే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌పై సస్పెన్షన్ వేటు వేసే అంశాన్ని ఈ సందర్భంగా పరిశీలించినట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rahul-national-wide-padayatra-from-oct-2nd-39-141089.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.