యువరాజా వారికి అక్కయ్య బ్యాక్ సపోర్ట్

Publish Date:Apr 4, 2014

Advertisement

 

రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి చూసుకోవాలని సోనియాగాంధీ తల్లి మనసు కొట్టుకొంటుంటే, ఆ తల్లి ముచ్చట తీర్చేందుకు ప్రియాంక వాధ్ర తమ్ముడి కోసం తెరవెనుక మంత్రాంగం నడిపిస్తూ చాలా కష్టపడుతున్నారని ఈమధ్య తరచూ వార్తలలో చూస్తున్నాము.

 

తల్లి కొడుకులిద్దరూ ఊరూరు తిరుగుతూ తమని గెలిపించమని ప్రచారం చేసుకొంటుంటే, ప్రియంక తమ్ముడి ఇంట్లో కూర్చొని అతను ఎక్కడ, ఏ విషయాలపై, ఏవిధంగా ప్రసంగించాలి? ఏ సభలో ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ప్రదర్శించాలి? ఏ సభకు ఎప్పుడు వెళ్ళాలి? అక్కడ ఏ కులస్తులు లేదా మతస్తులు అధికంగా ఉన్నారు? వారు విద్యావంతులా లేక నిరక్షరాస్యులా? అక్కడ స్థానిక సమస్యలేమిటి? వాటికి రాహుల్ సూచించవలసిన పరిష్కారాలేవిధంగా ఉండాలి?వంటి అన్ని వివరాలను క్రోడీకరించి అతని ప్రసంగాలకు తుదిమెరుగులు దిద్దుతూ, తమ్ముడి సభకు అవసరమయిన ఏర్పాట్లను ఇంటి నుండే పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా చూసి రాహుల్ గాంధీ కంటే అతని విజయం కోసం తెరవెనుక శ్రమిస్తున్న ఆ అక్కయ్యని చూసి ఎవరయినా మెచ్చుకోవడం సహజమే.

 

అయితే, భారతదేశం వంటి ఒక సువిశాలమయిన దేశాన్ని ప్రధాని కుర్చీలో కూర్చొని పరిపాలించాలనుకొంటున్న యువరాజవారిని నేటికీ ఎవరో ఒకరు వేలు పట్టుకొని నడిపిస్తే తప్ప తనంతట తానుగా నడవలేరని దీనితో స్పష్టం అవుతోంది. సోనియాగాంధీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ని రిమోట్ కంట్రోల్ తో నడిపిస్తూ దేశాన్ని పాలిస్తున్నట్లుగానే, ఒకవేళ రేపు ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి రాహుల్ ప్రధాని కుర్చీలో కూర్చొంటే, అప్పుడు  ఆయనను కూడా ఎవరో ఒకరు రిమోట్ ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో!

 

నరేంద్ర మోడీ తొలుత దేశవ్యాప్తంగా ప్రజలందరి నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్నారు. ఆ తరువాత ప్రధాని అభ్యర్ధిగా ప్రకటింపబడిన తరువాత పార్టీలో చాలా మంది సీనియర్ల నుండి కూడా తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొన్నారు. నేటికీ దేశంలో సగం మంది ఆయనను వ్యతిరేఖిస్తునే ఉన్నారు. కానీ ఆయన చాలా నేర్పుతో పట్టుదలగా ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ ఇప్పుడు దేశ ప్రజలందరి చేత, చివరికి తనను వ్యతిరేఖించిన తన పార్టీ నేతల చేత కూడా ‘నమో నమో’ అనిపించుకొంటూ అప్రతీహతంగా ముందుకు సాగిపోతున్నారు.

 

ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయన ముందు కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరు సాగిలపడి దాసోహమని ఆయనను భుజానెత్తుకొని భజన చేస్తుంటే, సాక్షాత్ ప్రధానమంత్రి డా.మన్మోహన్ సింగ్ ఆయన కోసం కుర్చీలో నుండి దిగిపోయేందుకు సిద్దమని పదేపదే చెప్పడమే కాక చివరికి మొన్న “ఎన్నికల తరువాత మరిక ప్రధాని కుర్చీలో కూర్చోబోను” అని ప్రకటించేసి యువరాజవారికి దారి నుండి అడ్డు తప్పుకొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కురువృద్దుడనిపించుకొన్న డా.మన్మోహన్, తను రాహుల్ గాంధీ క్రింద పనిచేయడానికి కూడా వెనుకాడనని నిసిగ్గుగా చెప్పుకొన్నారు.

 

ఇంతటి సానుకూల వాతావరణం ఉన్నపటికీ యువరాజవారు నెగ్గుకు రాలేకపోవడంతో ఎవరో ఒకరు ఆయన వేలు పట్టుకొని నడిపించక తప్పడం లేదు. పైగా ప్రియంకా గాంధీ ఆవిధంగా తమ్ముడికి సహాయపడటం ఏదో చాలా గొప్ప విషయమన్నట్లు దేశంలో మీడియా అంతా కోడై కూస్తోంది. మోడీ రాజకీయానుభవం, కార్యదక్షత, పరిపాలనానుభావం, తెలివి తేటలు తదితర అంశాలతో రాహుల్ గాంధీని ఎలాగూ పోల్చి చూడటానికి లేదు. కనీసం తనంతట తానుగా మాట్లాడగల తెలివి తేటలు, తన సభలను, కార్యక్రమాలను తానే చక్కబెట్టుకోగల నేర్పు, అందుకు అనుసరించవలసిన వేష బాషలు వంటి చిన్న చిన్నవిషయాలకు సైతం ఎవరో ఒకరి సలహాలు, సహకారం అవసరం పడటం చూస్తుంటే రేపు ఈయన ఇంత పెద్ద దేశాన్ని ఏవిధంగా ఏలుతారు? అనే ధర్మ సందేహం ఎవరికయినా కలగడం సహజమే. అటువంటప్పుడు ఇంట్లోంచి కాలు బయటపెట్టకుండా అన్నీ చక్కబెడుతున్న ప్రియాంక గాంధీయే (యువరాజవారి కంటే) ప్రధాని పదవికి బాగా సరిపోతారేమో సోనియమ్మ ఆలోచించితే మేలేమో.

By
en-us Political News

  
రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి.
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు. అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.
సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.