రాహుల్ గాంధీ పాదయాత్రతో ఏపీలో కాంగ్రెస్ కోలుకొంటుందా?

Publish Date:Jul 24, 2015

Advertisement

 

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితమే అనంతపురం జిల్లాలో ఓబులదేవర చెరువు నుండి పాదయాత్ర ప్రారంభించారు. జిల్లాలో ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను పరామర్శించడానికే ఆయన పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్నారు. కానీ రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా తుడిచిపెట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని తిరిగి బలోపేతం చేసేందుకే ఆయన పాదయాత్ర చేస్తున్నారని అందరికీ తెలుసు. అందుకే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆయన పాదయత్రని ఎన్నికల ప్రచారసభలాగా చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు సోనియా గాంధీ కూడా అదే జిల్లాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించినపుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయం సాధించింది కనుకనే రాహుల్ గాంధీ కూడా తన పర్యటనకు అనంతపురం జిల్లాని ఎంచుకొన్నారు తప్ప అక్కడి రైతులను ఓదార్చడానికని ఎవరూ భ్రమపడనవసరం లేదని తెదేపా నేతలు వాదిస్తున్నారు. కానీ రాష్ట్ర విభజనకు మూలకారకుడయిన రాహుల్ గాంధీ చేసే ఈ పాదయాత్రతో రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చేసుకొంటారనే భ్రమ కూడా అనవసరమేనని చెప్పక తప్పదు.

 

ఎందుకంటే ఆయన చేస్తున్న ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగకపోగా ఇప్పుడిప్పుడే మానుతున్న గాయాన్ని మళ్ళీ కెలికినట్లవుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో...ఎన్ని ఆర్ధిక సమస్యలు..పొరుగు రాష్ట్రంతో వివాదాలు, యుద్దాలు చేయవలసివస్తోందో, ఆ కారణంగా ప్రజలు, ఉద్యోగులు, విద్యార్ధులు కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరూ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఈ సమస్యలన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని హడావుడిగా రాష్ట్ర విభజన చేయడమేనని ప్రతీ ఒక్కరికీ తెలుసు. అందుకు కారకుడయిన రాహుల్ గాంధీ ఈ రోజు రాష్ట్రంలో పాదయాత్ర చేయడాన్నే ప్రజలు నిరసిస్తుంటే, ఆయన ఈరోజు తన పాదయాత్ర ముగింపు సమయంలో  కొండకమర్ల గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో రాష్ట్ర విభజన గురించి మాట్లాడబోతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన వలన రాష్ట్రానికి ఎటువంటి నష్టమూ జరగలేదని పైగా అంతా మంచే జరిగిందని ఆయన ఈ సభలో ప్రజలకి నచ్చచెప్పబోతున్నట్లు సమాచారం.

 

అదే నిజమయితే రాష్ట్రంలో జీవచ్చవంలా మిగిలున్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీయే స్వయంగా భూస్థాపితం చేసిపోయేందుకే ఆయన వచ్చారని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి, పల్లె, పరిటాల, ఎమ్మెల్సీ ముద్దు కృష్ణంనాయుడు చేస్తున్న వాదనలు నిజమని నమ్మక తప్పదు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు సిద్దపడగానే చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజకీయ సన్యాసం తీసుకొన్నారు. మరికొందరు ఎన్నికలకు ముందు, తరువాత ఇతర పార్టీలలోకి వెళ్లిపోయారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ నేతలు త్వరలో వేరే పార్టీలలోకి వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నారు. ఉదాహారణకి కొన్ని రోజుల క్రితమే మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైకాపాలోకి వెళ్ళబోతూ ఆఖరి నిమిషంలో ఆగిపోయారు. అటువంటివారు కాంగ్రెస్ పార్టీలో ఇంకా చాలా మందే ఉన్నారు. బహుశః రాహుల్ గాంధీ పాదయాత్ర ఎఫెక్ట్ తో పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసేసి వేరే పార్టీలోకి వెళ్లిపోవచ్చునని తెదేపా నేతలు అభిప్రాయ పడుతున్నారు.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని తెలిసినప్పటికీ, త్వరలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టబోతున్న రాహుల్ గాంధీ తక్షణమే చొరవచూపి పార్టీలో మిగిలిన నేతలయినా విడిచిపెట్టిపోకుండా కాపాడుకొనేందుకు, పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేయకుండా అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇటువంటి పాదయాత్రలు చేస్తుండటం ఆ పార్టీ దురదృష్టమేనని చెప్పక తప్పదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.