ఏక కాలంలో తెరాస, బీజేపీలపై యుద్ధం: తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ దిశా నిర్దేశం

Publish Date:May 7, 2022

Advertisement

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ వరంగల్ లో శుక్రవారం జరిగిన రైతు సంఘర్షణ సభలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న పలు సందేహాలు, అనుమానాలు, శంకలకు సమాధానం ఇచ్చి వాటిని పటాపంచలు చేసేశారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ స్టాండ్ ఏమిటన్నది కూడా విస్పష్టంగా ప్రకటించేశారు.  వచ్చే ఏన్నికలలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కుండబద్దలు కొట్టేశారు. ఇందుకు భిన్నమైన ఆలోచన చేసే వారు ఎంతటి వారైనా సరే కాంగ్రెస్ కు అవసరం లేదనీ, ఆ పార్టీలతో లాలూచీ పడేవారిని ఉపేక్షించబోమనీ, పార్టీ నుంచి ఉద్వాసన పలకడం ఖాయమని తేల్చేశారు. గత కొద్ది కాలంగా తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో తెరాస, కాంగ్రెస్ ల మధ్య ఎన్నికల పొత్తు ఉంటుందన్న అనుమానాలు నెలకొని ఉన్నాయి.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అటు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతోనూ. ఇటు తెరాస అధినేత కేసీఆర్ తోనూ వరుస బేటీలు జరపడమే ఈ అనుమానాలకు కారణం. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలంటే బీజేపీయేతర శక్తులన్నీ ఏకతాటిపైకి రావడమొక్కటే మార్గమని చెబుతూ వస్తున్న ప్రశాంత్ కిశోర్ ఏదో ఒక విధంగా రెండు పార్టీల మధ్యా డీల్ కుదిర్చే  అవకాశాలున్నాయా అన్న అనుమాలతో తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ ఒక కన్ఫ్యూజన్ లో కూరుకుపోయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి వారు అటువంటి అవకాశాలు లేవని గట్టిగా చెప్పినప్పటికీ ఆ అనుమానాలు పూర్తిగా నివృత్తి కాలేదు. రాహుల్ గాంధీ తన విస్పష్ట ప్రకటనతో వాటన్నిటినీ నివృత్తి చేసేశారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను ఎన్నికల సమరానికి సిద్ధం చేయడమే లక్ష్యంగా రైతు సంఘర్షణ సభ నిర్వహణ జరిగిందనడంలో సందేహం లేదు.

సభ లక్ష్యం పూర్తిగా నెరవేరిందనే చెప్పాలి.  బీజేపీ, తెరాస రెండూ ఒకటేననీ, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన పార్టీలేననీ రాహుల్ ఉద్ఘాటించి రెంటితో ఏకకాలంలో పోరాటం చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.  తెరాస ఫ్లాగ్ షిప్ పథకాలుగా చెప్పుకునే ఓ రెండు అంశాలు లక్ష్యంగా ఆ పార్టీపై రణభేరి మోగించింది కాంగ్రెస్. వాటిలో ఒకటి ధరణి పోర్టల్ కాగా, రెండోది రుణమాఫి. ఈ రెండూ కూడా ప్రచారార్భాటంతో ప్రజలలోకి వెళ్లి, ఆచరణలో విఫలం అయినవే కావడం గమనార్హం. రైతు సంఘర్షణ సభ వేదికగా టీపీసీసీ చీఫ్ ఆ రెంటిపైనా విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీకి వాగ్దానం చేశారు.

ఇవి రెండూ కూడా రైతులకు స్వాంతన పరి చేవే. కౌలు రైతునూ ఆదుకుంటామని ప్రకటించడం ద్వారా అంతరాలు లేకుండా రైతులందరినీ ఆదుకుంటామని చెప్పారు. చారిత్రాత్మకం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించి వరంగల్ డిక్లరేషన్ కేవలం డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ హామీ పత్రం అని ప్రకటించడం ద్వారా డిక్లరేషన్ లో ప్రకటించిన ప్రతి అంశాన్నీ అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న భరోసాను రాహుల్ ఇచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే గతానికి భిన్నంగా రాహుల్ ప్రసంగం ఆద్యంతం భావోద్వేగంతో సాగింది.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందన్న రాహుల్ తెలంగాణకు అన్యాయం చేసిన, చేస్తున్న టీఆర్ఎస్ తో కలిసే ప్రశక్తే లేదని ప్రకటించి, ఇకపై ఈ ప్రశ్న ఎవరడిగినా, అలా అడిగిన వారు ఎంత పెద్ద నాయకుడైనా సహించేది లేదనీ, బహిష్కరించడం ఖాయమనీ హెచ్చరించారు.

వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు పొందడానికి అర్హతేమిటో కూడా రాహుల్ ఈ సభ ద్వారా క్యాడరు స్పష్టం చేశారు. పార్టీ కోస, ప్రజల కోసం పని చేసే వారికే వచ్చే ఎన్నికలలో టికెట్లు ఇస్తామని వరంగల్ సభ వేదికగా ప్రకటించేశారు. మొత్తంగా వరంగల్ సభ ద్వారా రాహుల్ గాంధీ కాంగ్రెస్ క్యాడర్ లో ఉన్న కన్ఫ్యూజన్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారు.   బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందని చెప్పకనే చెప్పేశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఒంటరిగానే పోరాడుతుందని తేల్చేశారు. 

By
en-us Political News

  
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఉద్దేశించి తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రిని "ఆంబోతు" అని సంబోధిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
వైసీపీ హయాంలో  గ్రంథాలయ రంగానికి చెందాల్సిన సెస్ నిధులను ఖజానాకు మళ్లించారని, తమ ప్రభుత్వం రాగానే ఆ నిధులను తిరిగి గ్రంథాలయ బోర్డుకు జమ అయ్యేలా చర్యలు చేపట్టామన్న ఆయన..
రాష్ట్ర బీజేపీలో  అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలే ఈ పరిస్థితికి  కారణమన్నారు.  గతంలో జాతీయ స్థాయిలో తెలంగాణ నేతలకు ప్రాధాన్యత లభించేదని, కానీ ఈసారి ఒక్కరంటే ఒక్క తెలంగాణ నేతకు కూడా జాతీయ కార్యవర్గంలో చోటు లభించకపోవడం పార్టీ రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధమేనని రాజాసింగ్ పేర్కొన్నారు. 
చెన్నైలోని తిరువికా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీవీకే తరఫున విజయం సాధించిన పల్లవి తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. ప్రజాప్రతినిధిగా    సభకు  బిడ్డతో హాజరుకావడం పట్ల నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గత ప్రభుత్వం జీవోల ద్వారా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24.15 శాతానికి  తగ్గించిందని, ఇందు వల్ల దాదాపు 16 వేల 800 మంది బీసీ నాయకులు తమ రాజకీయ అవకాశాలను, ప్రాతినిధ్యాన్ని కోల్పోయారని చంద్రబాబు వివరించారు.
 ప్రజా సమస్యలపై పోరాడేందుకు కొత్త వేదికను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిన విజయసాయి..   ప్రజల తరఫున నిలబడి వారి హక్కుల కోసం ప్రశ్నించే బలమైన గొంతుకగా తాను నూతన పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
తూమాటి మాధవరావు శాసనమండలి కార్యదర్శికి  తన నామినేషన్ పత్రాలను   సమర్పించారు. రాష్ట్ర శాసనమండలిలో  వైసీపీకి సంఖ్యా బలం స్థానం ఉండటంతో..  డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. 
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.