రాహుల్ యాత్ర ఎఫెక్ట్.. కమలం పార్టీలో గుబులు

Publish Date:Dec 26, 2022

Advertisement

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అయితే ఈ యాత్రను సాధ్యమైనంతగా డౌన్ ప్లే చేయడానికి బీజేపీ చేయగలిగినంతా చేసింది. ఎవరికీ పట్టని యాత్రగా అభివర్ణించింది. యాత్ర సాగుతుండగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక, గుజరాత్  అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  అయినా రాహుల్ గాంధీ వాటిని వేటినీ పట్టించుకోకుండా స్థిత ప్రజ్ణతతో యాత్రను కొనసాగిస్తున్నారు.

రాజకీయ యాత్ర కాదు..  విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, అసహనం దేశంలో పెచ్చరిల్లిపోతున్న సమయంలో   ప్రేమ పంచేందుకూ, ప్రజలను ఏకం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానంటూ రాహుల్ జోడో యాత్ర మొదలు పెట్టడానికి ముందు చెప్పిన మాట నుంచి ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ జరగలేదు. రాజకీయాలు, ఎన్నికల ఫలితాలను గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదు. ఆఖరికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడం తప్ప మరేం చేయలేదు.  అయినా రాహుల గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా రాజకీయాలతో సంభంధం లేకుండా యువతీ యువకులు, విద్యార్ధులు, చిన్నారులు, మహిళలు,  రైతులు, కార్మికులు  ఇలా అన్నివర్గాల ప్రజలు రాహుల్ గాంధీ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటపాటలతో   రాహుల్ జోరుగా హుషారుగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మధ్య మద్యలో సినిమా స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ముఖ్యంగా సామాజిక మాధ్యమం అంతా రాహుల్ యాత్ర వెనుక ర్యాలీ చేస్తోంది. ఇంత ఉత్సాహంగా అంతులేని ఆదరణతో సాగుతున్న కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ కు ఏం ఒరిగింది అని ప్రశ్నించే వారికి నాగపూర్ స్థానిక ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భారతీయ జనతా పార్టీ కంచుకోట అయిన నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాగ్ పూర్ లోని 236 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 200 చోట్ల గెలుపొందింది. డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సొంత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. రాహుల్ జోడో యాత్ర కారణంగానే ఈ విజయం సిద్ధించింది. ఈ పరాజయానికి కారణాలు వెతుక్కునే పనిలో బీజేపీ ఉంటే పరిశీలకులు మాత్రం కరణాలు వెతుక్కోవలసిన అవసరం ఇసుమంతైనా లేదు.. అంతా రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావమే అంటున్నారు.

భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రజలతో మమేకమౌతున్న విధానం, హెల్త్ కాన్షస్ నెస్ సహా నడవడిక, వ్యవహార శైలి వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి.    ఆ ప్రభావమే నాగపూర్ ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించిందంటున్నారు. బీజేపీ ఎంత కాదంటున్నా.. రాహుల్ యాత్ర ఆ పార్టీలో గుబులు రేపుతున్నది. ఇందుకు సాక్ష్యం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే కాంగ్రెస్ ను తేలిగ్గా తీసుకోవద్దని క్యాడర్ ను హెచ్చరించడమేనని పరిశీలకులు అంటున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. బీజేపీ క్యాడర్ ను కాంగ్రెస్ విషయంలో హెచ్చరించడమే రాహుల్ యాత్ర బీజేపీలో గుబులు రేపుతున్నదనడానికి నిదర్శనం.

అంతే కాదు కర్నాటక రాష్ట్రంలో రాహుల్ యాత్ర సాగుతున్న సమయంలో బీజేపీ సంకల్ప యాత్ర ప్రారంభించింది. కర్నాటక లోని బీజేపీ సర్కార్ రాహుల్ యాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించింది.  తాజాగా కోవిడ్ ప్రొటోకాల్ ఆంక్షలు విధించింది. వీటిని వేటినీ పట్టించుకోకుండా రాహుల్ యాత్ర జనాదరణతో కొనసాగుతుండటం బీజేపీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ యాత్ర ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందన్నఆశా భావం హస్తంపార్టీలో వ్యక్తం అవుతుంటే.. అదే భావంతో బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది. 

By
en-us Political News

  
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.