అయినా.. రాహుల్ మారలేదు !

Publish Date:Mar 29, 2023

Advertisement

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ అనర్హత అంశంపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను కొనసాగిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు చాలా వరకు రాహుల్ గాంధీ భుజం మీద తుపాకి పెట్టి  ప్రధాని మోడీపై తూటాలు పేలుస్తున్నాయి. ఒక విధంగా చూస్తే, పార్లమెంట్ లో అదానీ మాయాజాలం గురించి రాజకీయ రచ్చ జరుగతున్న సమయంలో ముఖ్యంగా  రాహుల్ గాంధీ  ప్రధాని మోడీ, ఆదానీల సంబంధాలను ప్రశ్నిస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, రాహుల్ గాంధీని అనర్హునిగా  ప్రకటించడం  బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.

మోడీని నిజాయతీకి నిలువెత్తు రూపంగా భావించేవారు కూడా, దాల్ మే కుచ్ కాలా హై..  లేకుంటే పార్లమెంట్ లో రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పవలసింది పోయి ఆయననే అనర్హునిగా ప్రకటించడం ఏమిటని అడుగుతున్నారు. 
అయితే  అదే సమయంలో స్వాతంత్ర సమరయోధుడు వీరా సావర్కర్ ను అవమానపరిచే విధంగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష శిబిరంలో పెను దుమారమే రేపాయి.  నేను సవార్కర్ ను కాదు.  గాంధీని ..క్షమాపణ చెప్పను  అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్య కాంగ్రెస్ మిత్ర పక్షాలకే కాదు కాంగ్రెస్ నాయకులకు ముఖ్యంగా మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు రుచించడం లేదు. కాంగ్రెస్ మిత్ర పక్షం శివసేన (ఉద్దవ్ థాకరే) రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైరైంది. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన విందు సమావేశానికి ఉద్దవ్ థాకరే హాజరు కాలేదు. మరో వంక ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సావర్కర్ విషయంలో ఎక్కువ చేస్తే మనకే ప్రమాదం.సావర్కర్ కు ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు. రాహుల్ గాంధీ సవార్కర్ విషయంలో సంయమనంతో మాట్లాడి ఉంటే బాగుండేది అని కాంగ్రెస్ పార్టీకి  పరోక్షంగా చురకలు అంటించారు. 

ఈ అన్నిటినీ మించి సావర్కార్ మనవడు రంజిత్ సవార్కర్  తనతాత (వీర సావర్కర్) బ్రిటిష్ వారికి ఎప్పుడు క్షమాపణలు చెప్పారో సాక్షాధారాలతో నిరూపించాలని లేదంటే  పరువు నష్టం దవాకు సిద్దం కావాలని హెచ్చరించారు.  దీంతో  ఖర్గే నివాసంలో జరిగిన విపక్ష పార్టీల సమావేశంలోనూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై  కాంగ్రేస్సేతర పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాహుల్ గాంధీ అపరిపక్వ వ్యాఖ్యలతో  ప్రతిపక్ష పార్టీలు ఐక్యత ప్రశ్నార్ధకం అవుతోందని  కాంగ్రెస్సేతర పార్టీల ముఖ్యనేతలు ఖర్గే , సోనియా గాంధీ దృష్టికి తీసుకువేల్లినట్లు తెలిసింది.

2019 ఎన్నికల సమయంలో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ప్రధాని మోడీ టార్గెట్ గా రాహుల్ గాంధీ  కోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లుగా పేర్కొంటూ ‘చౌకీదార్ చోర్’ నినాదాన్ని కాయిన్  చేశారు. ఆ ఒక్క  ‘నినాదం చుట్టూనే ప్రచారం సాగించారు. అ ప్రచారమే కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిత్ర పక్షాలను దెబ్బతీసిందని, బీహార్ కు చెందిన ముఖ్యనేత ఒకరు ఖర్గే దృష్టి తెచ్చారని తెలిసింది. అలాగే రాహుల్ గాంధీ తమ ధోరణి మార్చుకోని పక్షంలో తమదారి తాము చూసుకోవలసి వస్తుందని హెచ్చరించారని విశ్వసనీయ సమాచారంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఈ నేపధ్యంలో ఖర్గే విందు సమావేశానికి హాజరైన 17 పార్టీలు సున్నిత విషయాలపై  అర్థరహిత వ్యాఖ్యలు చేయరాదని  ఒక వేళ పొరపాటున నోరు జారితే, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని నిర్ణయించినట్లు  తెలుస్తోంది. అయితే, రాహుల్ గాంధీని నియంత్రిచడం సోనియా, ఖర్గేలతో అవుతుందా? అనేది ఇప్పడు విపక్షాల  ముందున్న వెయ్యి డాలర్ల  ప్రశ్నగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.