175 కాదు.. 30, 35 స్థానాల్లో గెలిస్తే గొప్పే.. రఘురామకృష్ణం రాజు

Publish Date:Aug 9, 2022

Advertisement

రచ్చబండలో రఘురామ కృష్ణం రాజు తన సొంత పార్టీ వైసీపీని మరో సారి ఉతికి ఆరేశారు. ఢిల్లీలో చంద్రబాబు, మోడీ భేటీ విషయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియా సమావేశంలో విమర్శలు గుప్పించడాన్ని సెటైర్లతో కడిగి పరేశారు. వైసీపీలో ఏం చేసినా నాలుగుగోడల మధ్యేనని..పార్టీతో కలవడానికి ఎవరూ ముందుకు రారని పేర్కొన్నారు. మంగళవారం (ఆగస్టు9)న రచ్చబండ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ మరో సారి సొంత పార్టీ అధినేత జగన్ పైనా, పార్టీ తీరుపైనా విమర్శల వర్షం కురిపించారు. సెటైర్లతో చెడుగుడు ఆడేశారు. ఢిల్లీలో చంద్రబాబుతో మోడీ కొద్ది సేపు ముచ్చటించడంపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శించడాన్ని తప్పు పట్టారు. ఔను వాళ్లిద్దూరూ మాట్లాడుకున్నారు అందులో తప్పేముంది అని ప్రశ్నించారు.

 ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో ముఖ్యమంత్రిగా పని చేశారని, ఎన్డీఏ లో చంద్రబాబు నాయుడు కీలక నేతగా వ్యవహరించారని గుర్తు చేశారు. వారిద్దరి మధ్య కొంతకాలం గ్యాప్ వచ్చిందని, మళ్లీ ఇప్పుడు కలుసుకున్నారని, దాన్ని కూడా తప్పు పట్టడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రధానితో ఐదు నిమిషాలు బేటి అయితే, తమ ముఖ్యమంత్రి గంట సేపు పాటు కలిసి డిన్నర్ చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ప్రధాని, ఇతరులతో కలిసి డిన్నరే చేయలేదని గుర్తు చేశారు.   అయినా ప్రధాని గంటసేపు మధ్యాహ్న భోజనం చేశారని చెప్పడమే వింతగా ఉందని రఘురామ రాజు అన్నారు.  

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి పోటీ చేసినా, తాము మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అసలు వైసీపీతో కలిసే వారెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. మనం (వైసీపీ)  ఇలాగే నాలుగు గోడల మధ్య చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిందే అంటూ సెటైర్లు వేశారు. బిజెపి, జనసేన ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్నాయని, వారితో టీడీపీ జత కలిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రఘురామ కృష్ణం రాజు అన్నారు. తాను ఎప్పటినుంచో ఈ విషయాన్నిచెబుతున్నానీ, అయినా 175కు 175 అసెంబ్లీ స్థానాలలో గెలుస్తామని ధీమా ఉన్నప్పుడు, వాళ్లు కలిస్తే జగన్ కు వచ్చిన నష్టమేమిటని ప్రశ్నించారు.  క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే వైసీపీ 30 నుంచి 35 స్థానాలలో గెలిస్తే గొప్పేనన్నారు.

తెలంగాణలో గెలుపు కోసమే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో దీటుగా పోరాటం చేస్తున్న టిడిపితో బిజెపి జతకట్టే అవకాశాలున్నట్లుగా కనిపిస్తోందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.  9వ తేదీ వచ్చినప్పటికీ 60 శాతం మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.. ట్రెజరీకి వచ్చిన ఆదాయాన్ని తొలుత ఉద్యోగులకు జీతభత్యాలు ఇచ్చేందుకు వెచ్చించాలన్న ఆయన, ఆ సొమ్మును సంక్షేమ కార్యక్రమాల అమలుకు మళ్లించడం సరికాదన్నారు. ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం అన్నది ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఆ తర్వాతే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. కానీ ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తెచ్చి పెట్టుకున్న అధికారులకు, కీలక బాధ్యతలను అప్పగించి, నిధులను దారి మళ్ళిస్తున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు.  

రాష్ట్రంలో విప్పి చూపెడితే తప్పు లేదు కానీ, తప్పును ప్రశ్నిస్తే మాత్రం చితకబాదుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లాలో మాధవ రెడ్డి అనే వ్యక్తి క్యూలైన్లో ఎక్కువసేపు నిలబడలేక అసహనంతో నిరసన వ్యక్తం చేయగా, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అతనిని గొడ్డును బాదినట్టు బాదిన వీడియోను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రదర్శించారు. మాధవ రెడ్డిని చితకబాదినది గోరంట్ల మాధవ్ కాగా, ఆయన పై అప్పట్లో ఎస్పీకి ఫిర్యాదు చేయగా అతన్ని వీఆర్ లో ఉంచారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని గొడ్డును బాదినట్లు, బాదినందుకు మాధవ్ కు అతనికి ఎంపీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించారనీ,   ఇప్పుడు విప్పి చూపించినందుకు కూడా ప్రమోషన్ ఇస్తారేమోనని ఎగతాళి చేశారు.

గోరంట్ల మాధవ్ నగ్న వీడియో మార్ఫింగ్ చేశారనే విషయం ఎలా తెలుస్తుందని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.. కేసు నమోదు చేసి విచారణ చేపడితేనే కదా వీడియో మార్ఫింగ్ చేశారా?, లేదా?? అన్న విషయం తెలిసేదని నిలదీశారు.. నగ్న వీడియో తనది కాదని, మార్ఫింగ్ చేశారని తన మిత్రుడు, సహచర ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తుంటే, సకల శాఖామంత్రి అది మాధవ్ వీడియోని నిర్ధారించారన్నారు. సకల శాఖామంత్రి తన విశాల హృదయాన్ని చాటుకుంటూ, నాలుగు గోడల మధ్య వ్యవహారానికి ఇంత రాద్ధాంతం ఏమిటని ప్రశ్నించడం ఆయన మైండ్ సెట్ ను, పార్టీ మైండ్ సెట్ ను తెలియజేస్తుందన్నారు.  నాలుగు గోడలో లోపల జరిగిన వ్యవహారం, ఇద్దరి మధ్యలోనే ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండి ఉండేది కాదన్నారు. కానీ నాలుగు కోట్ల మంది ప్రజలు చూసి, 8 కోట్ల కళ్ళు గాయపడిన తర్వాత, నాలుగు గోడల మధ్యలో జరిగిన వ్యవహారం అంటూ పేర్కొనడం ఎమిటని ప్రశ్నించారు.    

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.