ఊ అంటావా రెడ్డీ.. ఉ-ఊ అంటావా రెడ్డీ.. హైకోర్టు తీర్పుపై రఘురామ రియాక్షన్
Publish Date:Mar 3, 2022
Advertisement
అమరావతి రాజధాని అంశంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు శిరస్సువంచి పాదాభివందనం చేస్తున్నట్టు తెలిపారు ఎంపీ రఘురామ. అమరావతిని కొంచం కూడా కదపలేరని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. అమరావతి అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్తే ఇంకా దెబ్బలు పడతాయని హెచ్చరించారు. మనోవేదనతో మరణించిన రైతుల మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. "ఊ అంటావా రెడ్డీ, ఉ..ఊ అంటావా రెడ్డీ.. ఉ అంటే రైతులు డేరాల నుంచి వెళ్లిపోతారు, లేకపోతే అదే డేరాలో రైతులుంటారు" అని రఘురామ అన్నారు. "అప్పు చేస్తారా లేక.. కేంద్రాన్ని బ్రతిమలుతారా.. అమరావతిలో అభివృద్ధి చేయాలి.. నేను ముఖ్యమంత్రి పదవి చేయలేను అనుకుంటే వదిలి వెళ్లిపోతారా మీరే ఆలోచించుకోండి" అని అన్నారు. ఎప్పుడూ మాట్లాడే సజ్జల, బొత్స సమన్వయం పాటించారన్నారు. అనవసరంగా కోర్టులను తప్పుదోవ పట్టించడం, అనవసర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని రఘురామ హితవు పలికారు. రాజధాని అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినదించారు. అమరావతి రాజధానిపై ఏపీ హైకోర్టు తీర్పును ఎంపీ స్వాగతించారు. అమరావతి తీర్పు సందర్భంగా ఢిల్లీలోని నివాసంలో సిబ్బందికి స్వీట్లు పంచారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జనసేనకు, పవన్ కళ్యాణ్‌కి, బీజేపీకి, మిగతా రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు చెప్పారు. అమరావతి కోసం చంద్రబాబు చేసిన కృషిని కొనియాడారు ఎంపీ రఘురామ.
http://www.teluguone.com/news/content/raghurama-reaction-on-amaravati-verdict-39-132522.html





