నాయ‌కా, ఇది త‌గునా..నిల‌దీసిన ర‌ఘురామ‌

Publish Date:Oct 13, 2022

Advertisement

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి రోజు రోజుకీ గండాలు గ‌డుస్తున్న లెక్క‌వేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వైసీపీ రెబెల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు తీవ్ర‌ స్థాయిలో త‌మ పార్టీ నాయ‌కుడు, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి మీద మరోసారి విరుచుకుప‌డ్డారు. అంద‌రం క‌లిసిక‌ట్టుగా రాజీనామా చేసి మూడురాజ‌ధానుల ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌ని సూచించారు. లోక్ సభ ఎంపీలతో పాటు, రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేయడమే కాకుండా, 151 మంది ఎమ్మెల్యేలు కూడా తమ శాసన సభ్యత్వానికి రాజీ నా మా చేసి ఎన్నికలకు వెళ్తే, మూడు రాజధానుల ఏర్పాటు పై ప్రజలు తమ నిర్ణయాన్ని ఓటు హక్కు ద్వారా తెలియజేస్తార న్నా రు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాజ ధాని అమరావతికి మద్దతుగా మాట్లాడి, ఇప్పుడు వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పడం హాస్యా స్పదంగా ఉందని విమర్శించారు. మూడు రాజధానుల ఎజెండాతో తాజాగా ఎన్నికలకు వెళ్లి, మళ్లీ నెగ్గితే, రాష్ట్ర పునర్వి భజన చట్టాన్ని మార్చాలని పార్లమెంటును అడుగుదామని అన్నారు. అయినా చట్ట సవరణ జరిగే అవకాశమే లేదన్నారు.

ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి కి మద్దతుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారా యణలు మాట్లాడిన వీడియో క్లిప్పింగులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. అమరావతిని బ్రహ్మాండంగా నిర్మిస్తామని జగన్మో హన్ రెడ్డి ప్రజలకు హామీ ఇవ్వగా, కబ్జాదారులు మాత్రమే రాజధాని మార్పును కోరుకుంటారని సత్తిబాబు గతంలోనే జ్యోతిష్యం చెప్పారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి యేనన్న ఎజెండాతో ఎన్నికలకు వెళ్లి గెలిచామని, ఇప్పుడు వికేంద్రీకరణ ఎజెండాతో ఎన్నికలకు వెళితే ప్రజలు 175కు 175 స్థానాలలో గెలిపిస్తారేమో చూద్దామంటూ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

అత్త మీది కోపం దుత్త మీద తీసినట్లుగా సాక్షి దినపత్రిక పైనున్న అక్కసును తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయ సాయి రెడ్డి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పై తీసినట్లుగా ఉన్నదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. విశాఖ భూ కుంభ‌కోణం పై వెల్లువెత్తు తున్న విమర్శలకు సాక్షి దినపత్రికలో ఎక్కడా ఖండన కనిపించకపోవడంతో, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీ రావును ఏక వచనంతో సంబోధిస్తూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత కొంతకాలం నుంచి వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించాలనుకుంటున్న విజయసాయిరెడ్డి, ఇప్పుడు రామోజీరావు పై ఆగ్రహంతోనే వార్తా దినపత్రిక, టీవీ ఛానల్ ను ప్రారంభించనున్నట్లుగా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

విజయసాయిరెడ్డి ప్రారంభించనున్న పత్రిక, చానెల్ కు సాక్షి దినపత్రికకు ఇచ్చిన ప్రాధాన్యత తమ ప్రభుత్వం ఇస్తుందని అనుకో వడం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. సాక్షి దినపత్రిక, చానెల్ లో విజయసాయి రెడ్డికి ఇతర పత్రికలు ఇచ్చినంత ప్రాధా న్యత కూడా ఇవ్వడం లేదని చెప్పారు. విశాఖ భూముల వ్యవహారంలో ఏ 1 కు తెలియకుండా, ఎ2 కొట్టేశారా? అన్న అనుమా నం ఏ 1 కు వచ్చినట్లుందని ప్రజలు అనుమానిస్తున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. పత్రిక, టీవీ ఛానల్ 10 రూపాయల షేర్లను 300 నుంచి 400 రూపాయలకు విక్రయించి, ఆ సొమ్మును రాబట్టగలరని ఎద్దేవా చేశారు. పత్రిక, టీవీ ఛానల్ రంగంలోకి అడుగుతున్న విజయ సాయి రెడ్డికి రఘురామకృష్ణంరాజు అభినందనలు తెలియజేస్తూ, మిగతా పత్రికలు ఛానల్ విలేకరుల మాదిరిగానే రచ్చబండ కార్యక్రమానికి నీతి టీవీ, నిజాయితీ దినపత్రిక విలేకరులు హాజరు కావచ్చునని ఆహ్వానం పలికారు. 

లక్ష రూపాయల మూలధనంతో ప్రారంభించిన అదాన్ డిస్టలరీ కంపెనీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారి సహకారం లేకుండానే రెండు మూడు వేల కోట్ల టర్నోవర్ చేసే స్థాయికి చేరుకుందా?  అని రఘురామ ప్రశ్నించారు. మద్యం వ్యాపారంలో ప్రముఖ కంపెనీలకు లేని టర్నోవర్ విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి ఎందుకు చేరుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రముఖ మద్యం కంపెనీలను కాదని, విజయసాయి అల్లుడు కంపెనీకి అంత వ్యాపారం వచ్చేసిందంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. తల్లి కూతురు, 104, 108 అంబులెన్స్ లతో పాటు, పోర్టు, సారా వ్యాపారం, నామినల్ ధరకే స్థలాల కొనుగోలు, అన్నీ వారికేనని అన్నారు.

ప్రజా ఆస్తి హక్కు పై ముఖ్యమంత్రి ఫోటో ముద్రణ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకమని ఇదే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ కు దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఒక లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారితోపాటు, భూ రెవెన్యూ చీఫ్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు లేఖలు రాసినట్లు తెలిపారు. ఈ వ్యవహారం పై వారం రోజులు వేచి చూస్తానని, లేకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తానని చెప్పారు.. భూ యజమానుల ఇండ్లలో శాశ్వ తంగా ఉండే ఆస్తిపత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు.

ప్రజా ఆస్తి హక్కు పత్రాలను పొందడానికి, భూ యజమానులు ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నంబర్ ను ఇవ్వాలని కోరడం కూడా నిబంధనలకు విరుద్ధమే నని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 324 అధికరణ ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలని, ప్రజా ఆస్తి హక్కు పత్రాలపై పార్టీ రంగులతో ఒక వ్యక్తి ఫోటో ముద్రించడం, ఈ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

By
en-us Political News

  
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
ఆ నక్కల కారణంగానే తాను తన మార్గాన్ని ఎంచుకుని బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలోని తన మాజీ సహచరులపై తీవ్ర విమర్శలు గుప్పించిన కవిత.. బీఆర్ఎస్‌లోని కొందరు గుంటనక్కల వంటి నేతల బృందం తనను ఒంటరిని చేసి, పక్కన పెట్టడానికి పద్ధతి ప్రకారం పనిచేశారని కవిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ అత్యంత కీలకమైన మలుపుగా మారబోతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి.
శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది. అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. వాస్తవానికి.. గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు. చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మొత్తం మీద మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది. chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.