రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Publish Date:Jul 3, 2023

Advertisement

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సోమవారం న్యూఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వాలని.. ఆ క్రమంలో పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి కానీ, ప్లోర్ లీడర్ కానీ, జాతీయ అధికార ప్రతినిధి పదవి కానీ ఇవ్వలని కమలం పార్టీ అధిష్టాన్ని కోరారు. పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నానని.. తానేందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదని ఆయన ప్రశ్నించారు. అయితే కొన్ని విషయాల్లో తన కులమే తనకు శాపం కావచ్చునని అభిప్రాయపడ్డారు.  అయితే రెండోసారి కూడా దుబ్బాక నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వచ్చి ప్రచారం చేయలేదని.. అలాగే తనకు ఎవరు సాయం చేయలేదని ఆయన పేర్కొన్నారు.
 
అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో 100 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినా.. బీజేపీ గెలవలేదని.. సొంతంగానే తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా రఘునందన్ రావు గుర్తు చేశారు. అదే 100 కోట్ల రూపాయిలు తనకు ఇస్తే.. తెలంగాణ దున్నేసేవాడినన్నారు.

దుబ్బాకలో తనను చూసి గెలిపించారని.. అంతేకాని బీజేపీ చూసి కాదన్నారు. తాను బీజేపీ అభ్యర్థిగా ఈ నియోజకర్గం నుంచి గెలవక ముందు.. జరిగిన ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తే కేవలం 3,500 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ది స్వయంకృతాపరాధమని, పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ  చేసిన సంజయ్‌కు వందకోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని రఘునందన్ రావు  ప్రశ్నించారు.

పార్టీ డబ్బులో తనకు వాటా ఉందని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బండి సంజయ్ మార్పుపై మీడియా ప్రశ్నించగా.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలేనన్నారు. పది ఏళ్లలో పార్టీ కోసం తనకంటే ఎవరు ఎక్కువ కష్టపడలేదని ఆయన పేర్కొన్నారు. 

అయితే పేపర్ ప్రకటనల్లో తరుణ్ చూగ్, సునీల్ బాన్సల్‌ బొమ్మలు కాదు.. రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ బొమ్మలుంటే ఓట్లు వేస్తారని ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీకి శాసనసభపక్ష నేత లేడనే విషయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సైతం తెలియదని.. ఆ విషయమై ఆయన్ని ప్రశ్నిస్తే అదేంటి అంటూ నడ్డా తనని అడిగారన్నారు. తాను గెలిచినందుకే ఈటెల బీజేపీలోకి వచ్చారన్నారు.

By
en-us Political News

  
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.