రాధేశ్యామ్.. హిట్టా? ఫట్టా?.. ముచ్చటగా మూడు మాటల్లో...
Publish Date:Mar 11, 2022
Advertisement
రివ్యూలు తెలుసుకోవాలంటే ఓ ప్రాబ్లమ్ ఉంటుంది. సగానికంటే ఎక్కువే సినిమా స్టోరీ చెప్పేస్తుంటారు. స్టోరీ లైన్ మొత్తం తెలిసిపోయాక.. సినిమాకెళితే ఆ ఫీల్.. థ్రిల్.. మిస్ అవుతుంది. అసలే టికెట్ రేట్లు భారీగా పెంచేశారు(?). అందుకే, రివ్యూ పేరుతో స్టోరీ మొత్తం తెలిసిపోతే.. మజా ఉండదు. ఇక యూట్యూబ్‌లో పబ్లిక్ టాక్ చూస్తే.. ఆదో దారుణం. ఏ సినిమాకైనా.. ఏ ఛానెల్ అయినా.. అదే ఓ నలుగురు ఐదుగురు జూనియర్ ఆర్టిస్టులు రివ్యూల పేరుతో చెలరేగిపోతారు. ముందే డైలాగులు రాసుకొచ్చి.. ఓవరాక్షన్ చేస్తూ.. పబ్లిక్ టాక్ పేరుతో పిచ్చెక్కిస్తుంటారు. ఏ సినిమాకైనా మాగ్జిమమ్ పాజిటివ్ ఫీడ్ బ్యాకే ఇస్తుంటారు. ఇక, రాధేశ్యామ్ సినిమా ఎలా ఉందనే ఆసక్తి కొద్ది మందిలోనే కనిపిస్తోంది. భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్‌కు ఉన్నతం క్రేజ్, బజ్.. రాధేశ్యామ్‌కు లేదనేది మాత్రం వాస్తవం. సినిమా ప్రమోషన్ కూడా సో..సో..గా సాగింది. అందుకు, ఇక మూవీ రిలీజ్‌కు ముందే.. రాజమౌళి ప్రభాస్‌ను ఇంటర్వ్యూ చేయడంతోనే చాలా మందికి డౌట్ వచ్చేసింది. జక్కన్న రంగంలోకి దిగడం.. హడావుడిగా ఇంటర్వ్యూ చేయడంతో సినిమా డౌటా? అనుకున్నారంతా. సినిమా వాళ్లు ముందే చెప్పినట్టు.. ఇది ప్యూర్ లవ్ స్టోరీ. ఒక్క మాస్ సీన్ కూడా లేని క్లాసిక్ తరహా సినిమా. ప్రభాస్ అంటే కత్తి పట్టాలి.. లేదంటే, గాల్లో ఎగరేసి కొట్టాలి. అంతేకానీ, లవ్ చేస్తా.. ముద్దు పెడతా.. జాతకం చూస్తా.. అంటే ఎవరు చూస్తారు ఫ్యాన్స్ తప్ప. ఇప్పుడదే టాక్. రాధేశ్యామ్‌కు దాదాపు అన్నిసైట్లు యావరేజ్ రేటింగ్. ట్రైలర్ చూసే అంతా డిసప్పాయింట్ అయ్యారు. ఈ రోజుల్లో.. ఆ రోజుల్లో తరహా లవ్ స్టోరీ ఎవరికి కావాలి? ఇప్పుడంతా యో-యో టైప్ జనరేషన్. డీజే టిల్లు, అర్జున్‌రెడ్డి తరహా ఎఫ్ అండ్ ఎఫ్ స్టైల్. అంతేగానీ, ఏమాయ చేశావో.. గీతాంజలి తరహా ప్యూర్ లవ్ స్టోరీ తీస్తే.. అదికూడా ప్రభాస్‌తో. అందుకే అంతగా వర్కవుట్ కాలేదంటున్నారు. ప్రభాస్ బాగున్నాడు. పూజా హెగ్డా కూడా సూపర్. యూరప్ ఇంకా బాగుంది. విజువల్ వండర్ కూడా. కానీ.. స్టోరీనే సో సో. ఎమోషన్స్ అంతగా పండలే. కథ, కథనంలో కొత్తదనం లే. ఫస్ట్ హాఫ్, సెకండాఫ్ అనే తేడా లేకుండా.. సినిమా అంతా సాగదీత సీన్సే. బోరింగ్ ట్రీట్మెంటే. బయట ఎండ ఎక్కువగా ఉంటే.. చల్లగా రిలాక్స్ కావలనుకుంటే రాధేశ్యామ్ కు వెళ్లొచ్చు. కాసేపు హాయిగా గడిపి రావొచ్చు. ఇది.. ప్రభాస్ చేయాల్సిన సినిమా కాదు. బాహుబలి, సాహోల తర్వాత ఇలాంటి స్టోరీ ఎంచుకొని డార్లింగ్ రిస్క్ చేశారు. కనీసం.. సలార్, ఆదిపురుష్‌తోనైనా మళ్లీ పాత యాక్షన్ మాస్ మసాలా మిర్చి హీరోను చూస్తామేమో చూడాలి.
http://www.teluguone.com/news/content/radhe-shyam-moview-talk-39-132885.html





