భారత స్వాతంత్ర్య పోరాటానికి ఉగ్గు పోసింది ఈ ఉద్యమమే!

Publish Date:Aug 8, 2023

Advertisement

భారతదేశం ఈరోజు ఎంత స్వేచ్చగా ఉందో మాటల్లో వర్ణించలేనిది. బ్రిటీష్ పాలకుల చేతుల్లో నలిగిన భారతదేశం ఎలా ఉండేదో ఆ కాలంలో జీవించి, ఆనాటి పరిస్థితులు అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తాయి. నాటి పౌరులు తమ పరిస్థితులకు అక్షరరూపం ఇచ్చినా, నాటి పరిస్థితులకు దృశ్యరూపం ఇస్తూ సినిమాలు, డాక్యుమెంటరీలు రూపొందించినా అదంతా ఖచ్చితంగా నాటి భారతం అనుభవించిన క్షోభ కంటే తక్కువే.  తెల్లదొరల పాలన నుండి భారతదేశానికి  విముక్తి తీసుకురావడంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో తమ ప్రాణాలు  త్యాగం చేశారు. ఈ భారతదేశ పోరాటాల్లో ప్రథమంగా చెప్పుకోగలిగింది క్విట్ ఇండియా ఉద్యమం. భారత స్వాతంత్య్రమే ధ్యేయంగా సాగిన  ఈ ఉద్యమం 81ఏళ్ళ కిందట ఇదే నెలలో, ఇదే తేదీన ఊపిరిపోసుకుంది. అంటే క్విట్ ఇండియా ఉద్యమం పురుడుపోసుకుని ఈ ఏడాది ఆగష్టు 8వ తేదీకి 81ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ ఉద్యమ విశేషాలు, ఈ ఉద్యమం సాగిన తీరు తదితర వివరాలు తెలుసుకుంటే..

 1942సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.  ఈ ఉద్యమానికి అప్పటి బొంబాయిలోని ఆగస్టు క్రాంతి మైదానం కేంద్రకమైంది(ఇదే ఇప్పటి ముంబై). భారత జాతీయ కాంగ్రేస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభించబడింది.  ఈ ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమం అనే కాకుండా ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు.  ఈ ఉద్యమంలోనే జాతిపిత గాంధీజీ  "డూ ఆర్ డై" నినాదాన్ని ఇచ్చారు. 'సాధించు లేదా మరణించు' అనే ఈ నినాదంతో  గాంధీజీ మార్గనిర్దేశకత్వంలో శాలనోల్లంఘన యాత్ర సాగింది.  భారతీయుల నిరసనను అడ్డుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆపరేషన్ జీరో అవర్ ప్రారంభించింది. ఎంతో మంది కాంగ్రేస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రేస్ కార్యాలయాలపై దాడులు చేయించింది. నివేదికల ప్రకారం దాదాపు లక్షమంది అరెస్ట్ చేయబడ్డారు. వీరందరూ చాలాకాలం పాటు ఖైదు చేయబడ్డారు. సుమారు 1000మంది మరణించారు. ఈ ఉద్యమంలో 2500మందికి పైగా గాయపడ్డారు.   ఉద్యమంలో కీలక సభ్యులైన గాంధీజీ, జవహార్ లాల్ నెహ్రూలను కూడా జైలులో పెట్టారు. ఇలా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. అయితే దీని తరువాత స్వాతంత్ర్యపోరాట ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ క్విట్ ఇండియా  ఉద్యమం చాలా కీలక పాత్ర పోషించింది. బ్రిటీషువారికి భారతదేశం మీద ఉన్న పట్టును బలహీనపరచడంలోనూ, వలసవాదవిదానాల పైన తీసుకోవలసిన నిర్ణయాలను, చేసుకోవలసిన మార్పుచేర్పుల అవసరాన్ని ఇది తేలతెల్లం చేసింది.

1945లో రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత రాజకీయంగా డీకోలనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో భారతదేశ యోధుల పోరాటం మరింత ఊపందుకుంది.క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లే మార్పులు తక్షణమే తీసుకురాలేదు. అయినప్పటికీ, ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఉద్యమం స్వాతంత్య్రానికి అనుకూలంగా భారతీయ ప్రజాభిప్రాయాన్ని పెంచడానికి దోహదపడింది.  భారతీయ ప్రజలు తమ స్వేచ్ఛను సాధించడానికి నిశ్చయించుకున్నారని బ్రిటీష్ వారికి బలంగా నొక్కి వక్కాణించింది. ఈ ఉద్యమంలోనే  భారతదేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించే కొత్త తరం నాయకులు ఆవిర్భవించారు. జాతీయ ఐక్యతా భావాన్ని కూడా ఈ ఉద్యమం ద్వారా పెంపొందించగలిగారు.

మహిళలు కూడా..

క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందరో  మహిళలు కీలక పాత్ర పోషించారు. అపారమైన ధైర్యాన్ని,  నాయకత్వాన్ని ప్రదర్శించారు. అహింసా యుద్దమనే కారణం ఈ  ఉద్యమంలో ఎంతో మంది మహిళలు చురుకుగా పాల్గొనడానేలా చేసింది.  సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ లాంటి మహా వీర వనితల స్పూర్తితో, వారి నాయకత్వం కింద ఎందరో మహిళలు ఈ ఉద్యమంలో అపర చంఢికలై  కదం తొక్కారు. ఈ ఉద్యమలోనే విద్య, సంస్కృతి ప్రాధాన్యతను దేశం యావత్తు గుర్తించింది. ఈ కాలంలో దేశంలో ఎన్నో చోట్ల విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు స్థాపించబడ్డాయి.

ఇలా క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఊపందుకోవడానికి గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేసింది.  అలాగే విద్య,సంస్కృతి ప్రాధాన్యతను గుర్తించేలా చేసింది.  మొత్తం దేశ పౌరులను ఏకం చేసింది.

                                                           *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.